
రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా పెన్నీ స్టాక్స్‌పై ఫోకస్ పెడతారు. ఎందుకంటే అవి ఒక్కోసారి మల్టీ-బ్యాగర్ రిటర్న్స్ అంటే అధిక లాభాలు ఇస్తాయి. ముఖ్యంగా అలాంటి కంపెనీలకు పెద్ద ఆర్డర్లు లేదా కాంట్రాక్టులు వచ్చినప్పుడు వాటి షేర్ల ధరలు బాగా పెరుగుతాయి. అలాంటి స్టాక్స్‌లో అడ్రాయిట్ ఇన్ఫోటెక్ ఒకటి. తాజాగా అడ్రాయిట్ ఇన్ఫోటెక్ అనుబంధ సంస్థ అయిన వెర్సో అల్టిమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి భారీ ఆర్డర్‌ను అందుకుంది. దీంతో బుధవారం మార్కెట్ మొదలైన వెంటనే అడ్రాయిట్ ఇన్ఫోటెక్ షేర్లు సుమారు 1.5శాతం పెరిగాయి.
అడ్రాయిట్ ఇన్ఫోటెక్ అనుబంధ సంస్థ అయిన వెర్సో అల్టిమా ఇండియాకు వచ్చిన ఈ ఆర్డర్ విలువ రూ. 29 కోట్లు. ఈ ఆర్డర్ ప్రధానంగా అప్లికేషన్ రిపేర్, సపోర్ట్ సేవలకు సంబంధించింది. ఈ కాంట్రాక్ట్ ఐదేళ్ల కాలానికి వర్తిస్తుంది. ఇందులో ఆన్‌సైట్, ఆఫ్‌షోర్ సపోర్ట్ సేవలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అడ్రాయిట్ ఇన్ఫోటెక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అయితే ఈ షేర్ దాని 52 వారాల గరిష్ట స్థాయి అయిన రూ.30.40 నుండి ఇప్పటికీ రూ.19.66 తక్కువగానే ఉంది. అయితే రాబడి పరంగా కంపెనీ పనితీరు పెట్టుబడిదారులకు మిశ్రమంగా ఉంది. గతంలో ఈ షేర్ పనితీరును చూస్తే.. గత మూడు నెలల్లో ఇది -3.33శాతం, ఆరు నెలల్లో -30.68శాతం, ఒక సంవత్సరంలో -43.62శాతం ప్రతికూల రాబడిని ఇచ్చింది. గత మూడేళ్లలో ఇది -14.33శాతం నష్టపోయింది. అయితే ఐదేళ్ల కాలంలో చూస్తే ఈ స్టాక్ 169.15శాతం లాభాలు ఇచ్చింది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అడ్రాయిట్ ఇన్ఫోటెక్.. ఒక ప్రముఖ SAP కన్సల్టెన్సీ కంపెనీ. దీని అనుబంధ సంస్థ అయిన వెర్సో అల్టిమా ఇండియా, టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు బిజినెస్ సపోర్ట్ సిస్టమ్స్ – ఆపరేషన్స్ సపోర్ట్ సిస్టమ్స్ సేవలను అందిస్తుంది. ఈ కంపెనీ 20 కంటే ఎక్కువ దేశాల్లో సేవలందిస్తూ నాలుగు ఖండాలలో తన వ్యాపారాన్ని విస్తరించింది. వెర్సో అల్టిమా సహకారంతో, అడ్రాయిట్ ఇన్ఫోటెక్ అనలిటిక్స్, ఐఓటీ, ఏఐ, 5జీ క్లౌడ్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కూడా సేవలు అందిస్తోంది.
(Note: షేర్ మార్కెట్లలో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు అన్ని పత్రాలను, నిబంధనలను జాగ్రత్తగా చదవండి. పెట్టుబడుల విలువ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఈ పెట్టుబడి నిర్ణయాలకు మీరు మాత్రమే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణుడిని సంప్రదించడం మంచిది)
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..