Gold Bonds: గోల్డ్ బాండ్స్‎లో పెట్టుబడి పెట్టడం మంచిదేనా.. దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే..

|

Dec 01, 2021 | 10:24 AM

 2021-22 ఎనిమిదో దఫా సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు నవంబర్ 29 నుండి  ప్రారంభమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) SGB  తాజా విడత ఇష్యూ ధరను గ్రాముకు రూ.4,791గా నిర్ణయించింది.  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి డిజిటల్‌గా చెల్లించే పెట్టుబడిదారులకు గ్రాముకు రూ.50 తగ్గింపును ఇస్తుంది..

Gold Bonds: గోల్డ్ బాండ్స్‎లో పెట్టుబడి పెట్టడం మంచిదేనా.. దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే..
Gold Bands
Follow us on

2021-22 ఎనిమిదో దఫా సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు నవంబర్ 29 నుండి  ప్రారంభమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) SGB  తాజా విడత ఇష్యూ ధరను గ్రాముకు రూ.4,791గా నిర్ణయించింది.  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి డిజిటల్‌గా చెల్లించే పెట్టుబడిదారులకు గ్రాముకు రూ.50 తగ్గింపును ఇస్తుంది. అలాంటి పెట్టుబడిదారులకు ఇష్యూ ధర గ్రాము బంగారంపై రూ.4,741గా ఉంటుంది.

భారత ప్రభుత్వ మద్దతుతో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లో బంగారంపై పెట్టుబడి పెట్టే వారిని పెంచడానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుడికి పలు ప్రయోజనాలు కల్పించింది. ఈ గోల్డ్ బాండ్ పథకం ప్రయోజనాలకు సంబంధంచి SBI ట్వీట్ చేసింది.

పథకం 2015లో ప్రారంభించబడింది
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ నవంబర్ 2015లో ప్రారంభించబడింది. భౌతిక బంగారానికి డిమాండ్‌ను తగ్గించడం. బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఉపయోగించే గృహాల పొదుపులో కొంత భాగాన్ని ఆర్థిక పొదుపుగా మార్చడం దీని లక్ష్యం.

SGBలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆరు ప్రయోజనాలు అవి ఏటంటే..

  • సావరిన్ గోల్డ్ బాండ్ పెట్టుబడిదారులు ప్రతి సంవత్సరం సంవత్సరానికి 2.5% చొప్పున వడ్డీని పొందుతారు. ఈ వడ్డీ అర్ధ సంవత్సర ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది.
  • క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ నుండి మినహాయింపు ఉంటుంది.
  • గోల్డ్ బాండ్‎లను రుణం కోసం పూచీకత్తుగా ఉపయోగించవచ్చు.
  • సురక్షితం, భౌతిక బంగారం వంటి నిల్వ సమస్య లేదు.
  • ఎక్స్ఛేంజీలలో వర్తకం చేయవచ్చు.
  • GST నుండి మినహాయింపు, మేకింగ్ ఛార్జీలు లేవు.

ఆన్‌లైన్ కొనుగోలుపై గ్రాముకు రూ.50 తగ్గింపు

ప్రభుత్వం, ఆర్‌బీఐతో సంప్రదింపులు జరిపి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపులు చేసే పెట్టుబడిదారులకు ఇష్యూ ధరలో గ్రాముకు రూ.50 తగ్గింపును అనుమతించింది. ఈ బాండ్లను కొనుగోలు చేసేటప్పుడు ఒక వ్యక్తి గరిష్ఠంగా నగదు చెల్లింపు కోసం రూ. 20,000 వరకు చెల్లించవచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చెక్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించడానికి ఎంచుకోవచ్చు. గోల్డ్ బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు ఉంటుంది. ఐదు సంవత్సరాల తర్వాత నిష్క్రమణ ఎంపిక అందుబాటులో ఉంటుంది.

Read also.. Gold Price Today: బంగారు ప్రియులకు శుభవార్త. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు. ఈరోజు తులం ధర ఎంత ఉందంటే..