Stock Market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 1,223, నిఫ్టీ 332 పాయింట్లు అప్.. జెలెన్‌స్కీ ప్రకటనే కారణమా..

|

Mar 09, 2022 | 7:38 PM

ఆర్థిక, ఆటోమొబైల్ స్టాక్‌ల ర్యాలీతో బుధవారం స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. బిఎస్‌ఈ సెన్సెక్స్ 1,223 పాయింట్లు (2.29 శాతం) పెరిగి 54,647 వద్ద స్థిరపడింది...

Stock Market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 1,223, నిఫ్టీ 332 పాయింట్లు అప్.. జెలెన్‌స్కీ ప్రకటనే కారణమా..
stock market
Follow us on

ఆర్థిక, ఆటోమొబైల్ స్టాక్‌ల ర్యాలీతో బుధవారం స్టాక్‌ మార్కెట్లు(Stock Market) భారీగా లాభపడ్డాయి. బిఎస్‌ఈ సెన్సెక్స్(Sensex) 1,223 పాయింట్లు (2.29 శాతం) పెరిగి 54,647 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(Nifty) 332 పాయింట్లు (2.07 శాతం) పెరిగి 16,345 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 2.16 శాతం, స్మాల్ క్యాప్ షేర్లు 2.38 శాతం పెరిగాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలను ఎత్తివేయడంతో విమానయాన స్టాక్‌లు పెరిగాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.85. నిఫ్టీ ఆటో 2.04 శాతం పెరిగాయి. నిఫ్టీ మీడియా కూడా 4.05 శాతం వరకు జంప్ చేసింది. అయితే నిఫ్టీ మెటల్ 0.34 శాతం పడిపోయింది. ఏషియన్ పెయింట్స్ నిఫ్టీలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ స్టాక్ 6.12 శాతం పెరిగి రూ. 2,890కి చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం స్టాక్‌లు లాభపడ్డాయి. బీఎస్ఈలో 686 కంపెనీల స్టాక్‌ ప్రైస్‌ తగ్గగా, 2,655 కంపెనీల షేర్లు పెరిగాయి. 30 షేర్ల BSE ఇండెక్స్‌లో, ఏషియన్ పెయింట్స్, RIL, బజాజ్ ఫైనాన్స్, M&M, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకి ఇండియా టాప్ గెయినర్‌లలో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, ఎన్‌టిపిసి, టాటా స్టీల్, నెస్లే ఇండియా నష్టాల్లో ముగిశాయి.

రష్యాతో పోరాటం చేస్తున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో నాటో యుద్ధం చేయదని.. ఇక తాను నాటో సభ్యత్వం కోసం ఒత్తిడి చేయబోనని ప్రకటించారు. నాటో తమని చేర్చుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పారు. రష్యా ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటి కావడంతో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల తీవ్రత ఇక చల్లబడే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇది సూచీలను ఉత్సాహపరిచింది. రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ.. ఐరోపా దేశాలు మాత్రం అందుకు దూరంగా ఉన్నాయి. దీంతో చమురు ధరలు మరింత పెరగకుండా ఐరోపా దేశాల నిర్ణయం కొంత మేర కట్టడి చేయనున్నట్లు మదుపర్లు భావించారు. మరోవైపు భారత్‌లో చమురు నిల్వలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని పెట్రోలియం శాఖ మంగళవారం హామీ ఇచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చే సరఫరాలోనూ ఎలాంటి సమస్యలు తలెత్తవని ప్రకటించింది. ఇక దేశీయంగా రిటైల్‌ ధరల పెంపు ప్రజా ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొనే ఉంటుందని తెలిపింది. ఈ ప్రకటన మార్కెట్‌కు కలిసొచ్చింది.

Read Also.. Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన యాక్సిస్ బ్యాంకు.. ఎంత పెంచిందంటే..