రెండో రోజు మార్కెట్ల దూకుడు

|

May 28, 2020 | 6:21 PM

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూసుకు పోయాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 595.37 పాయింట్లు లాభపడి 32,200.59 పాయింట్ల వద్ద స్థిరపడింది. ముందురోజు 1,000 పాయింట్లు జమ చేసుకున్న సెన్సెక్స్‌ తాజాగా మరో 595 పాయింట్లు బలపడింది. నిఫ్టీ సైతం 175 పాయింట్లు ఎగసి 9,500కు చేరువలో 9,490 వద్ద నిలిచింది. ఇందులో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్ల అండతో లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఫ్యూచర్‌, డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండడం ఇందుకు నేపథ్యం. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా […]

రెండో రోజు మార్కెట్ల దూకుడు
Follow us on

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూసుకు పోయాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 595.37 పాయింట్లు లాభపడి 32,200.59 పాయింట్ల వద్ద స్థిరపడింది. ముందురోజు 1,000 పాయింట్లు జమ చేసుకున్న సెన్సెక్స్‌ తాజాగా మరో 595 పాయింట్లు బలపడింది. నిఫ్టీ సైతం 175 పాయింట్లు ఎగసి 9,500కు చేరువలో 9,490 వద్ద నిలిచింది.

ఇందులో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్ల అండతో లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఫ్యూచర్‌, డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండడం ఇందుకు నేపథ్యం. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, మీడియా, రియల్టీ, బ్యాంకింగ్‌ మెటల్‌ రంగాలు 4-2.5 శాతం మధ్య ఎగశాయి.  నిఫ్టీ దిగ్గజాలలో జీ, ఐషర్‌, ఎల్‌అండ్‌టీ, హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కో 10-4 శాతం మధ్య జంప్‌చేశాయి.