Sensex Crash: దీపావళికి ముందు మదుపరులకు బ్లాక్ డే.. లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు..

|

Oct 28, 2021 | 4:47 PM

దీపావళి ముందు బుల్ పరుగులకు బ్రేక్ పడింది. కోట్ల రూపాయలు కరిగిపోయాయి. ఒకటి రెండు కోట్లు కాదు ఏకంగా నాలుగన్నర లక్షల కోట్లు ఆవిరయ్యాయి.

Sensex Crash: దీపావళికి ముందు మదుపరులకు బ్లాక్ డే.. లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు..
Sensex Crash
Follow us on

దీపావళి ముందు బుల్ పరుగులకు బ్రేక్ పడింది. కోట్ల రూపాయలు కరిగిపోయాయి. ఒకటి రెండు కోట్లు కాదు ఏకంగా నాలుగన్నర లక్షల కోట్లు ఆవిరయ్యాయి. నాలుగున్నర లక్షల కోట్ల సంపద ఆవిరి. ఇవాళ దలాల్ స్ట్రీట్‌ బేర్‌ మనడంతో జరిగిన పతనమిది. మార్కెట్ మూగిసే సమయానికి 1158 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 59వేల 984 మార్క్‌ దగ్గర ఆగింది. 353పాయింట్ల అంతిమ నష్టంతో నిఫ్టీ ముగిస్తే, 1365 పాయింట్ల నష్టంలో బ్యాంక్‌ నిఫ్టీ క్లోజ్ అయ్యింది. మధ్యాహ్నం 11గంటల 30 నిమిషాల టైమ్‌లో మార్కెట్‌ బలోపేతమవుతున్న సంకేతాలు కనిపించినా ఆ వెంటనే క్షణాల్లో కుప్పకూలింది. ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్‌తో మదుపర్ల సంపద నాలుగున్నర లక్షల కోట్లు ఆవిరైపోయింది.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు అక్టోబరు డెరివేటివ్‌ కాంట్రాక్టు గడువు ముగింపు నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి అడుగులు వేశారు. బ్యాంకింగ్‌, విద్యుత్‌, రియాల్టీ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో.. సూచీలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. కాసేపటికే మరింత దిగజారాయి. ఇలా పడిపోతూనే ఉన్నాయి. ఎవరి ఊహలు అందకుండా జారిపోయింది.

ఇవి కూడా చదవండి: YCP VS TDP: ఢిల్లీకి చేరిన ఏపీ ఫైట్.. అమిత్‌షాకు వైసీపీ, టీడీపీ ఎంపీల పోటా పోటీ ఫిర్యాదులు.. 

GHMC Transfer Twist: ఎల్‌బి నగర్‌ వెళ్లేందుకు విముఖత.. మళ్లీ కూకట్ పల్లిలోనే.. బదిలీలపై మళ్లీ కొత్త జీఓ..