Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 497, నిఫ్టీ 157 పాయింట్ల వృద్ధి..

|

Dec 21, 2021 | 5:09 PM

సోమవారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ మంగళవారం పుంజుకుంది. సెన్సెక్స్ 497 పాయింట్లు లాభపడి 56,319 వద్ద, నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 16771 వద్ద ముగిశాయి.

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 497, నిఫ్టీ 157 పాయింట్ల వృద్ధి..
Stock Market
Follow us on

సోమవారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ మంగళవారం పుంజుకుంది. సెన్సెక్స్ 497 పాయింట్లు లాభపడి 56,319 వద్ద, నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 16771 వద్ద ముగిశాయి. మెటల్ స్టాక్ షేర్లలో అత్యధిక లాభాలు నమోదయ్యాయి. సెక్టార్ ఇండెక్స్ 2.94 శాతం లాభంతో ముగిసింది. ఇదే సమయంలో మీడియా సెక్టార్‌లో 2.54 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 2.06 శాతం, ఐటీ రంగంలో 1.98 శాతం, రియల్టీ సెక్టార్‌లో 1.61 శాతం, ఎనర్జీ సెక్టార్‌లో 1.16 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్, ఆటో రంగాలు కూడా నేడు లాభాలతో ముగిశాయి. కానీ వాటి వృద్ధి 1 శాతం కంటే తక్కువగా ఉంది. నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ 1.89 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 1.44 శాతం లాభపడ్డాయి. అ

నిఫ్టీలోని 39 షేర్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. టాప్-గ్రోయింగ్ స్టాక్స్‌లో హెచ్‌సిఎల్ టెక్ 4.32 శాతం, విప్రో 3.78 శాతం, యుపీఎల్ 3.62 శాతం లాభపడ్డాయి. మరోవైపు, నిఫ్టీ స్టాక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన వాటిలో పవర్‌గ్రిడ్ 1.74 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.09 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.71 శాతం క్షీణించాయి. మరోవైపు, నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీలోని 12 స్టాక్‌లు 3 శాతానికి పైగా లాభంతో ముగిశాయి. ఇండస్ టవర్ అత్యధికంగా 6 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. ఈరోజు మొత్తం మార్కెట్‌లో 411 స్టాక్‌లు సంవత్సరంలో గరిష్ఠ స్థాయికి చేరుకోగా, 411 స్టాక్‌లు ఈరోజు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. మరోవైపు 34 స్టాక్‌లు ఏడాది కనిష్ఠానికి చేరుకోగా, 253 లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.

Read Also.. Mapmyindia IPO: ఇన్వెస్టర్లపై కనక వర్షం కురిపించిన మ్యాప్ మై ఇండియా.. ఎంతకు లిస్టయిందో తెలుసా..