భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా కొన్ని యాప్స్ యూపీఐ సాయంతో చేసే పేమెంట్స్‌కు అండగా నిలిచాయి. ముఖ్యంగా పేటీఎం, ఫోన్‌పే, గూగుగల్ పే వంటి యాప్స్ అధిక ప్రజాదరణను పొందాయి. ఈ నేపథ్యంలో ఫోన్‌పే యాప్ వివిధ సర్వీసులను కూడా అందించడం మొదలు పెట్టింది. తాజాగా ఫోన్‌పే యాప్ షేర్ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించనుంది. ఈ మేరకు ఫోన్‌పే వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి. ‘షేర్.మార్కెట్’ పేరుతో స్టాక్‌బ్రోకింగ్ విభాగంలోకి ప్రవేశించిందని పేర్కొన్నాయి. ఈ యాప్‌ని కంపెనీ ఈ సంవత్సరంలో అతిపెద్ద లాంచ్‌గా అభివర్ణిస్తున్నారు. అలాగే షేర్.మార్కెట్‌కు సీఈఓగా ఉజ్వల్ జైన్‌ను కంపెనీ ఎంపిక చేసింది. ఈ తాజా లాంచ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
షేర్.మార్కెట్ సేవ బ్రోకింగ్‌లోకి కొత్త జనాభాను తీసుకువస్తుందని ఫోన్‌పే వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. వెల్త్‌బాస్కెట్‌లతో సహా ఆఫ్-ది-షెల్ఫ్ క్వాంట్ రీసెర్చ్-లెడ్ ఆఫర్‌లతో ప్రజలు తమ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించడంలో సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం