Business Idea: ప్రతి నెలా రూ.80 వేలు సంపాదించుకోవచ్చు..! అతి తక్కువ పెట్టుబడితో ట్రెండీ బిజినెస్‌..

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే సెల్ఫీ కాఫీ బిజినెస్ ఇప్పుడు ట్రెండింగ్. 3D ప్రింటర్‌తో కాఫీ, డ్రింక్స్, కేక్‌లపై వ్యక్తిగత ఫోటోలను ముద్రించి ఆకర్షణీయమైన ఉత్పత్తులను అందించవచ్చు. రోజుకు 50 కాఫీలు అమ్మడం ద్వారా నెలకు రూ.80 వేల నుండి రూ.1 లక్ష వరకు సంపాదించవచ్చు.

Business Idea: ప్రతి నెలా రూ.80 వేలు సంపాదించుకోవచ్చు..! అతి తక్కువ పెట్టుబడితో ట్రెండీ బిజినెస్‌..
Indian Currency

Updated on: Jan 24, 2026 | 8:57 PM

తక్కువ పెట్టుబడితో ఒక మంచి బిజినెస్‌ చేయాలని చూస్తున్న వారికి ఈ ఐడియా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పాపులర్‌ అవుతున్న ఈ ట్రెండీ బిజినెస్‌ను త్వరగా మీ ఏరియాలో స్టార్ట్‌ చేయడం వల్ల అద్భుతమైన లాభాలు అందుకోవచ్చు. అది కూడా అతి తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్‌ మొదలుపెట్టొచ్చు. ఇంతకీ బిజినెస్‌ ఏంటంటే..సెల్ఫీ కాఫీ బిజినెస్. ఈ వ్యాపారం గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇప్పుడిప్పుడే ట్రెండ్ అవుతున్నటువంటి ఈ బిజినెస్ లో ముఖ్యంగా కాఫీ పైన ఉండే నురుగు లో ఎవరైనా ఒక వ్యక్తి ఫోటోను ముద్రించవచ్చు. దీనికోసం ఫుడ్ గ్రేడెడ్ కలర్స్ ఉపయోగించి ప్రింట్ చేసే 3d ప్రింటర్ కావాల్సి ఉంటుంది. ఫోటో ప్రింట్ అయిన కాఫీని చూసేందుకు చాలా ముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, కపుల్స్, అలాగే సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ త్రీడి ఇమేజ్ ఫుడ్ కలర్ ప్రింటింగ్ కాఫీపై మాత్రమే కాదు. లస్సీ, థిక్ షేక్, కేకులు, ఫ్రూట్ జ్యూస్, మిల్క్ షేక్ వంటి వాటి పైన కూడా ప్రింట్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.

ఈ బిజినెస్ కోసం Mini Coffee Printer మెషిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు రూ.1.20 లక్షలు ఉంటుంది. ఇందులో food printer, Food-grade edible ink తో కలిపి మెషీన్ లభిస్తుంది. అలాగే ఒక ఫిల్టర్ కాఫీ మిషన్ కావాలి. దీని ధర సుమారు రూ.20 వేల వరకు ఉంటుంది. దీంతో పాటు లస్సి, ఫ్రూట్ షేక్ వంటివి తయారు చేయడానికి మిక్సర్ గ్రైండర్, బ్లెండర్ వంటివి కొనుగోలు చేయాలి. ఇక ఈ బిజినెస్ సెట్అప్ చేసుకోవడానికి ఒక కాఫీ షాప్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీనికోసం మంచి సిట్టింగ్ ఉన్నటువంటి ఒక షాపును అద్దెకు తీసుకొని బిజినెస్ చేసినట్లయితే చక్కటి ఆదాయం లభించే అవకాశం ఉంది. ఒక సెల్ఫీ కాఫీ ధర రూ.100 నుంచి రూ. 150 పెట్టినా మంచి సేల్‌ ఉంటుంది. ప్రతిరోజు ఒక 50 కాఫీలు అమ్మినా కనీసం రూ.5000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఖర్చులు Rent, Staff, food Ink Refills వంటి ఖర్చులకు నెలకు రూ.50 వేలు పోయినా నెలకు రూ.80 నుంచి రూ.1 లక్ష వరకూ సంపాదించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి