Credit Card: విదేశీ ప్రయాణాలకు క్రెడిట్ కార్డు.. కార్డు ఎంపికలో ఈ విషయాలు గమనించాల్సిందే..

|

Mar 18, 2022 | 1:14 PM

Credit Card: విదేశీ ప్రయాణాల్లో వినియోగించేందుకు నగదు, ఫారెక్స్​ కార్డు(Forex card), ట్రావెలర్ చెక్కులు(Traveler Checks) లాంటి అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ క్రెడిక్ కార్డుల వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సరైనా కార్డు ఎంపికకు వీటిని తప్పక పాటించండి..

Credit Card: విదేశీ ప్రయాణాలకు క్రెడిట్ కార్డు.. కార్డు ఎంపికలో ఈ విషయాలు గమనించాల్సిందే..
Credit Cards
Follow us on

Credit Card: విదేశీ ప్రయాణాల్లో వినియోగించేందుకు నగదు, ఫారెక్స్​ కార్డు(Forex card), ట్రావెలర్ చెక్కులు(Traveler Checks) లాంటి అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ క్రెడిక్ కార్డుల వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణ సమయాల్లో ముఖ్యంగా క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయటం అత్యంత సులభమని బ్యాంక్ బజార్ సీఈఓ అధిల్ శెట్టి చెబుతున్నారు. అవసరమైన సమయాల్లో నగదు తీసుకునే వీలుతో పాటు, కొనుగోళ్ల సమయంలో రివార్డులు, క్యాష్ బ్యాక్ లు, డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు వస్తాయి. ఇందుకోసం మార్కెట్లో అనేక రకాలైన క్రెడిట్‌ కార్డులు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల వినియోగదారులు వివిధ కార్డులపై వచ్చే ప్రయోజనాలను పరిశీలించిన తరువాతే సరైన క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి. మీరు వెళుతున్న దేశంలో కార్డు అంగీకారం గురించి తెలుసుకోవాలి. కార్డు వినియోగ ఛార్జీలు, లేట్ పేమెంట్ పెనాల్టీలు, రివార్డుల గురించి ముందుగా తెలుసుకోవాలి.

మీరు ప్రయాణం చేసేముందు క్రెడిట్ కార్డు సంస్థకు తెలియజేయటం వల్ల వెసులుబాట్లు పొందవచ్చు. ట్రావెల్ సమయంలో కార్డు సేఫ్టీ కోసం నెట్ బ్యాంకింగ్ ద్వారా లిమిట్స్ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ కార్డు మిస్ అయినా, మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు భావించినా తాత్కాలికంగా కార్డును బ్లాక్ చేసుకునేందుకు సదరు సంస్థను సంప్రదించవచ్చు. కొన్ని కార్డులకు ఇన్సూరెన్స్ ఫెసిలటీ కూడా ఉంటుంది. దాని వల్ల ప్రయాణంలో వస్తువులు, పాస్ పోర్ట్ పోయినా, ప్రయాణం ఆలస్యం అయినా, ప్రమాదాలు, విమానాల రద్దు తదితర సందర్భాల్లో పరిహారం లభిస్తుంది. వీటికి సంబంధించిన పూర్తి నియమనిబంధనలను ముందుగానే అడిగి తెలుసుకోండి. క్రెడిట్ కార్డు ఉండటం వల్ల విమానాశ్రయాల్లో లాంజ్ యాక్సిస్, కాంప్లిమెంటరీ ఫుడ్, ఛార్జ్ ఫ్రీ మనీ విత్ డ్రాయెల్ వంటి బెనిఫిట్స్ గురించి ముందుగా తెలుసుకోవటం ఉత్తమం.

విదేశాలకు వెళ్లేటప్పుడు ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులను తీసుకెళ్లడం మంచిది. ఒక కార్డును అంగీకరించకపోయినా మరోటి ఉపయోగపడుతుంది. వీసా, మాస్టర్‌కార్డు, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇలా వివిధ నెట్‌వర్క్‌ల కార్డులు ఉండేలా చూసుకోవాలి. కార్డుల జాగ్రత్త విషయంలో అప్రమత్తత అవసరం.

ఇవీ చదవండి..

Russia Ukraine War: ఉక్రెయిన్ లో రష్యా విధ్వంసంపై జెలెన్‌స్కీ వీడియో విడుదల.. హృదయ విదారక దృశ్యాలు..

Investment: పెట్టుబడుల వివరాలు ఉద్యోగి HRకు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది..? పూర్తి వివరాలు..