Multibagger Penny Stock: చిన్న పెన్నీ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడం కొంతమేర ఎక్కువ రిస్క్ తో కూడుకున్న అంశం. ఎందుకంటే సాధారణంగా ఈ స్టాక్స్ ఎక్కువ శాతం సర్కూట్ల మధ్య ట్రేడ్ అవుతుంటాయి. ఎక్కువ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు తక్కువ లిక్విడిటీ ఉండే పెన్నీ స్టాక్లలో మల్టీబ్యాగ్ రిటర్న్ కోసం పెట్టుబడి పెడుతుంటారు. ఎస్ఈఎల్ మ్యానుఫ్యాక్చురింగ్ కంపెనీ లిమిటెడ్(SEL Manufacturing Company Ltd) కంపెనీ షేర్ ప్రస్తుతం మల్టీబ్యాగ్ రిటర్న్ అందిస్తోంది. ఈ షేర్ ధర ఎన్ఎస్ఈలో 2021 నవంబరు 16న రూ. 9.75 గా ఉంది. కేవలం మూడు నెలల కాలంలో తాజాగా షేర్ ధర రూ. 209.85కు చేరింది. కేవలం 3 నెలల స్వల్ప కాలంలో షేరు ధర 2000 శాతం పెరిగింది. ఈ స్టాక్ లో మీరు రెండు నెలల కిందట రూ. లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ప్రస్తుతం దాని విలువ నేడు రూ.8.40 లక్షలుగా ఉండేది. అదే ఈ షేర్ లో నెల కిందట రూ. లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. దాని విలువ నేడు రూ. 2.90 లక్షలుగా ఉంది.
ఇవీ చదవండి..
Indian Railways: రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఇక ఏ స్టేషన్ నుంచైనా ట్రైన్ ఎక్కొచ్చు..
Car Loan: కారు కొంటున్నారా.. లోన్ తీసుకోవాలంటే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి?