
భారత పెట్టుబడి మార్కెట్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI తాజాగా మ్యూచువల్ ఫండ్ వర్గీకరణలో పెద్ద సంస్కరణలు చేపట్టింది. ఈ నిర్ణయంతో పదవీ విరమణ నిధులు, పిల్లల నిధులు వంటి కొన్ని పాత వర్గాలను మూసివేసి, వాటి స్థానంలో ‘లైఫ్ సైకిల్ ఫండ్’ అనే ఆధునిక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ అండ్ సీఈఓ రాధికా గుప్తా ఈ నిర్ణయాన్ని భారత ఆస్తి నిర్వహణ రంగానికి “నిర్ణయాత్మక మార్పు”గా అభివర్ణించారు. ఆమె ప్రకారం ఇది లక్ష్య ఆధారిత పెట్టుబడులను మరింత సులభతరం చేస్తుంది.
లైఫ్ సైకిల్ ఫండ్ ప్రధాన ప్రయోజనం ఏంటంటే.. ఆటోమేటిక్ ఆస్తి కేటాయింపు. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు పడిపోతుందో అంచనా వేయాల్సిన అవసరం లేకుండా, దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇది సౌకర్యవంతమైన మార్గంగా నిపుణులు భావిస్తున్నారు. దీర్ఘకాల లక్ష్యాలతో (రిటైర్మెంట్, పిల్లల విద్య) పెట్టుబడి పెట్టేవారికి లైఫ్ సైకిల్ ఫండ్లు ఒక స్మార్ట్, క్రమశిక్షణ గల పెట్టుబడి సాధనంగా మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి