SCR: ఫెస్టివల్‌ సీజన్‌.. రైల్వే ప్రయాణికులు గుడ్‌న్యూస్‌! ప్రత్యేక రైళ్లు ఏర్పాటు.. పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!

హోలీ పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 14 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను చర్లపల్లి-హజరత్‌ నిజాముద్దీన్‌, చర్లపల్లి-మదార్‌, తిరుపతి-రక్సాల్ మార్గాల్లో నడుపుతున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. జనరల్, స్లీపర్, ఏసీ కోచ్‌లతో ప్రయాణం సుఖమయం.

SCR: ఫెస్టివల్‌ సీజన్‌.. రైల్వే ప్రయాణికులు గుడ్‌న్యూస్‌! ప్రత్యేక రైళ్లు ఏర్పాటు.. పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
Trains 5

Updated on: Feb 17, 2026 | 3:39 PM

హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. వివిధ గమ్యస్థానాల మధ్య మొత్తం 14 ప్రత్యేక సర్వీసులను ప్రవేశపెట్టింది.

చర్లపల్లి – హజరత్‌ నిజాముద్దీన్‌ – చర్లపల్లి మధ్య రైలు నెం.07023/07024 ప్రత్యేక రైళ్లు ఆరు సర్వీసులు నడుస్తాయి. చర్లపల్లి నుంచి ఫిబ్రవరి 23, 28, మార్చి 2 తేదీల్లో రాత్రి 7.45 గంటలకు బయలుదేరి రెండో రోజు ఉదయం 5 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 25, మార్చి 2, 4 తేదీల్లో ఉదయం 7.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.20 గంటలకు చర్లపల్లి చేరుతుంది. ఈ రైళ్లు కాజీపేట, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

అలాగే చర్లపల్లి – మదార్‌ జంక్షన్‌ – చర్లపల్లి మధ్య రైలు నెం.07119/07120 రెండు సర్వీసులు నడుస్తాయి. ఫిబ్రవరి 28న చర్లపల్లి నుంచి బయలుదేరే రైలు మార్చి 3న మదార్ నుంచి తిరిగి ప్రయాణిస్తుంది. ఈ రైళ్లు నిజామాబాద్, నాందేడ్, ఉజ్జయిని, చిత్తౌర్‌ఘర్, అజ్మీర్ వంటి స్టేషన్లలో ఆగుతాయి.

ఇక తిరుపతి – రక్సాల్ – తిరుపతి మధ్య రైలు నెం.07051/07052 ఆరు సర్వీసులు నడుస్తాయి. ఫిబ్రవరి 21, 28, మార్చి 7 తేదీల్లో తిరుపతి నుంచి బయలుదేరే రైళ్లు రాయ్‌పూర్, రూర్కెలా, రాంచీ, ధన్‌బాద్ మార్గంగా రక్సాల్ చేరుకుంటాయి. అన్ని ప్రత్యేక రైళ్లలో సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us