భారతదేశంలో ఓ పదేళ్ల నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఆధార్ అంటే ప్రభుత్వం జారీ చేసే విశిష్ట గుర్తింపు సంఖ్య. ఆధార్ సిస్టమ్ వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వ్యక్తుల గుర్తింపు సులభంగా మారింది. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉంటుందనే చందాన ఆధార్ ఉపయోగించి మోసం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యతను ఇస్తూ ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ ఆధార్ లాకింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అయితే మీ ఆధార్ లాక్ చేశాక మళ్లీ వినియోగించాలంటే కచ్చితంగా అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆధార్ లాక్ ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆధార్ లాకింగ్ ఫీచర్ ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధిస్తుంది. అయితే ఒక్కసారి లాక్ చేశాక మళ్లీ అన్‌లాక్ చేయాల్సిన సందర్భాలు రావచ్చు. మీరు మీ ఆధార్‌ను అన్‌లాక్ చేయడంలో సమస్యను ఎదుర్కొంటే లేదా సింపుల్‌గా మన ఫోన్‌లో మై ఆధార్ యాప్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. యూఐడీఏఐ ఆధార్ భద్రతకు అందించే వర్చువల్ ఐడీ ద్వారా ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో బ్యాంకింగ్ లావాదేవీల్లో ఆధార్ కీలకపాత్ర పోషిస్తున్నందున బయోమెట్రిక్ ఆథంటికేషన్‌ను నిరోధించేందుకు ఆధార్ లాకింగ్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఆధార్‌ను ఎలా లాక్ చేయాలో? ఓ సారి చూద్దాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..