SBI YONO App: ఎస్‌బిఐ కస్టమర్లకు ముఖ్య గమనిక.. ‘యోనో’ యాప్ ఈ సమయంలో పని చేయదు..!

|

Sep 04, 2021 | 4:41 AM

SBI YONO App: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. తన కస్టమర్ల సేవలకు స్వల్ప అంతరాయం కలిగే అవకాశం ఉందని ముందుగానే అలర్ట్ ప్రకటించింది.

SBI YONO App: ఎస్‌బిఐ కస్టమర్లకు ముఖ్య గమనిక.. ‘యోనో’ యాప్ ఈ సమయంలో పని చేయదు..!
అంతేకాకుండా ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా గృహ రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి ఈ ఆఫ‌ర్ కింద 5 బేసిస్ పాయింట్లు (0.05 శాతం) అద‌న‌పు వ‌డ్డీ రాయితీని కూడా ఎస్‌బీఐ అందిస్తోంది. మ‌హిళ‌ల‌కు అదనంగా మ‌రో 5 బేసిస్ పాయింట్లు రాయితీని ప్రకటించింది. ఎస్‌బీఐ గృహ‌రుణం ప్రస్తుత‌ ప్రారంభ వ‌డ్డీ రేటు 6.70 శాతంగా ఉంది.
Follow us on

SBI YONO App: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. తన కస్టమర్ల సేవలకు స్వల్ప అంతరాయం కలిగే అవకాశం ఉందని ముందుగానే అలర్ట్ ప్రకటించింది. ‘‘ఎస్‌బిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ వంటి అనేక ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు నిర్వహణ పని కారణంగా సెప్టెంబర్ 4, 2021 న 22:35 గంటల నుండి మరియు సెప్టెంబర్ 5, 2021న 01:35 గంటల మధ్య అందుబాటులో ఉండవు.’’ అని వెల్లడించింది. ఈ మేరకు ఎస్‌బీఐ అధికారికంగా ట్వీట్ చేసింది. దాదాపు 180 నిమిషాల పాటు ఈ సేవలకు అంతరాయం కలిగింది.

‘‘మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి మేం కృషి చేస్తున్నందున మా గౌరవనీయ కస్టమర్లు మాకు సహకరించాలని అభ్యర్థిస్తున్నాము. ఎస్‌బిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ వంటి అనేక ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు నిర్వహణ పని కారణంగా సెప్టెంబర్ 4, 2021 న 22:35 గంటల నుండి మరియు సెప్టెంబర్ 5, 2021న 01:35 గంటల మధ్య అందుబాటులో ఉండవు. అసౌకర్యానికి చింతిస్తున్నాము.’’ అంటూ ట్వీట్ చేసింది.

Also read:

Kcr-Modi: ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 50 నిమిషాల ఈ భేటీలో దేని గురించి చర్చించారంటే..

IND vs ENG 4th Test Day 2 Highlights: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. ముగిసిన రెండో రోజు ఆట.. దూకుడుమీదున్న రాహుల్..

Villagers Protest: ఏపీ రాజధాని పంచాయతీ పెద్దలపై గ్రామస్థుల వినూత్న నిరసన.. ఆఫీసులో గాడిదను కట్టేసి ఆందోళన.. ఎందుకో తెలుసా..