SBI vs HDFC Bank: మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే ‘బ్యాంకింగ్’ ఏది?

SBI vs HDFC Bank: షేర్ మార్కెట్‌లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఒడిదుడుకులు ఇన్వెస్టర్లను కాస్త టెన్షన్ పెట్టాయి. మీరు మీ పెట్టుబడిని కేవలం ఒకే బ్యాంక్ కి పరిమితం చేయకుండా, ఈ రెండింటిలోనూ కొంత మొత్తాన్ని కేటాయించడం తెలివైన పని. తద్వారా అటు స్థిరత్వం, ఇటు వేగవంతమైన వృద్ధి రెండింటి ప్రయోజనాలను పొందవచ్చు..

SBI vs HDFC Bank: మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే బ్యాంకింగ్ ఏది?
Sbi Vs Hdfc Bank

Updated on: Apr 11, 2026 | 5:30 AM

SBI vs HDFC Bank: షేర్ మార్కెట్‌లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఒడిదుడుకులు ఇన్వెస్టర్లను కాస్త టెన్షన్ పెట్టాయి. ముఖ్యంగా మార్చి నెలలో వచ్చిన భారీ అమ్మకాల వల్ల చాలా మంది పోర్ట్‌ఫోలియోలు నష్టాల్లోకి వెళ్లాయి. అయితే, ఏప్రిల్ నెల మార్కెట్‌కు కొత్త ఊపిరి పోసింది. ఈ రికవరీలో బ్యాంకింగ్ రంగ దిగ్గజాలైన SBI, HDFC బ్యాంక్ షేర్లు మళ్ళీ పుంజుకుంటున్నాయి. మరి ఈ రెండు దిగ్గజాల్లో ఏ షేర్ కొంటే ఎక్కువ లాభాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

మార్కెట్ విశ్లేషకులు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు?

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఇటీవల తన పోర్ట్‌ఫోలియోలో కీలక మార్పులు చేసింది. వారు HDFC బ్యాంక్‌లో పెట్టుబడులను కొంత తగ్గించి, SBI లో తమ వాటాను పెంచుకున్నారు. ఎస్‌బీఐ మార్చిలో ఈ షేర్ 18% వరకు పడిపోయింది. కానీ ఏప్రిల్‌లో మళ్ళీ కోలుకుంది. దీని మార్కెట్ క్యాప్ సుమారు రూ.10 లక్షల కోట్లు. అలాగే HDFC Bank కూడా మార్చిలో 17% పడిపోయినప్పటికీ, గత ఒక్క వారంలోనే 10% కంటే ఎక్కువ లాభాన్ని ఇచ్చింది. దీని మార్కెట్ క్యాప్ సుమారు రూ.13 లక్షల కోట్లు.

Bajaj Pulsar: పల్సర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మళ్ళీ వచ్చేసిన ‘లెజెండ్’.. కొత్త ఫీచర్లు, తక్కువ ధరతో బజాజ్ పల్సర్ లాంచ్!

HDFC బ్యాంక్: సవాళ్లు, భరోసా

HDFC బ్యాంక్ షేర్లు పడిపోవడానికి కేవలం మార్కెట్ కారణం కాదు. బ్యాంక్ మాజీ చైర్మన్ అతను చక్రవర్తి రాజీనామా చేయడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. అయితే RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఒక స్పష్టతనిస్తూ, HDFC బ్యాంక్ పనితీరులో ఎలాంటి లోపాలు లేవని భరోసా ఇచ్చారు. ఈ క్లారిటీ రావడంతో ఇన్వెస్టర్ల నమ్మకం పెరిగి షేర్ ధర మళ్ళీ పెరగడం మొదలైంది.

ఇవి కూడా చదవండి

ఏది ‘లాంగ్ రేస్’ గుర్రం?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెండు బ్యాంకులు కూడా ఫండమెంటల్‌గా చాలా బలంగా ఉన్నాయి. కానీ వాటి స్వభావం వేరు:

SBI (త్వరిత లాభాలు): ఇది సైక్లికల్ స్టాక్. అంటే మార్కెట్ పెరిగినప్పుడు ఇది వేగంగా దూసుకుపోతుంది. తక్కువ సమయంలో లాభాలు ఆశించేవారికి, ప్రభుత్వ బ్యాంకులపై నమ్మకం ఉన్నవారికి ఇది మంచి ఛాయిస్. అయితే, ఇది వడ్డీ రేట్ల మార్పులకు త్వరగా ప్రభావితం అవుతుంది.

HDFC Bank (స్థిరమైన లాభాలు): మీరు సుదీర్ఘ కాలం పెట్టుబడి పెట్టాలనుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సరైనది. ఇది ఒక స్థిరమైన షేర్. డిపాజిట్లు, క్రెడిట్ వృద్ధిలో ఈ బ్యాంక్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే రిస్క్ తక్కువగా ఉండాలనుకునే వారికి ఇది ఉత్తమ ఆప్షన్.

ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

మీరు మీ పెట్టుబడిని కేవలం ఒకే బ్యాంక్ కి పరిమితం చేయకుండా, ఈ రెండింటిలోనూ కొంత మొత్తాన్ని కేటాయించడం తెలివైన పని. తద్వారా అటు స్థిరత్వం, ఇటు వేగవంతమైన వృద్ధి రెండింటి ప్రయోజనాలను పొందవచ్చు.

Gold Reserves: అత్యధిక బంగారం ఏ దేశం వద్ద ఉంది? భారత్‌ ఏ స్థానంలో? టాప్‌ -5 దేశాలు ఇవే!

ఇది కూడా చదవండి: AC Servicing: సర్వీసింగ్ చేయించిన తర్వాత కూడా మీ ఏసీ కూలింగ్‌ కావడం లేదా? ఇదే ప్రధాన కారణం కావచ్చు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us