SBI Alert: మీరు ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులా.. అయితే ఈ వార్త తప్పకుండా చదవాలి..

|

May 22, 2022 | 7:25 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్‌ మేసేజ్‌ వస్తోంది. మీ ఎస్‌బీఐ ఖాతా బ్లాక్‌ చేశారని మరో ఫేక్‌ మెసేజ్‌ తాజాగా సర్య్యూలేట్‌ అవుతోంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది...

SBI Alert: మీరు ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులా.. అయితే ఈ వార్త తప్పకుండా చదవాలి..
Sbi Sco Posts
Follow us on

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్‌ మేసేజ్‌ వస్తోంది. మీ ఎస్‌బీఐ ఖాతా బ్లాక్‌ చేశారని మరో ఫేక్‌ మెసేజ్‌ తాజాగా సర్య్యూలేట్‌ అవుతోంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నకిలీ ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్‌(Email)లకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని సూచించింది. ఈ మేరకు వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలను పంచుకోవద్దని వెల్లడించింది. ఒకవేళ అటువంటి సందేశాలు మీకు వస్తే report.phishing@sbi.co.inకు నివేదించాలని కోరింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌లో ఈ హెచ్చరికను షేర్‌ చేసింది. ఫేక్‌ SMSలు, కాల్‌లకు స్పందించవద్దని ఏజెన్సీ SBI వినియోగదారులను కోరింది.

అయితే, ఎస్‌బీఐ బ్యాకింగ్‌కు సంబంధించి ఫేక్‌ మెసేజ్‌లు సర్క్యూలేట్‌ కావడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలోనూ చాలా మంది ఎస్‌బీఐ కస్టమర్లకు.. KYC నిబంధనలను పాటించనందుకు తమ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మెసేజ్‌లు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ లింక్‌ ఇచ్చి KYCని అప్‌డేట్‌ చేయమని కేటుగాళ్లు కోరారు. ఈ నేపథ్యంలోనే ఖాతాదారులెవరూ నకిలీ సందేశాలతో వచ్చే లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని ఎస్‌బీఐ హెచ్చరించింది. SMSను స్వీకరించినప్పుడు SBI సరైన షార్ట్ కోడ్ కోసం తనిఖీ చేయాలని కోరింది. అప్రమత్తంగా ఉండండి అంటూ SBI తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్‌ చేసింది.

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి…