Fixed Deposit Interest: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు.. ఎవరికి ఎంత శాతం..!

|

Jul 22, 2021 | 1:54 PM

Fixed Deposit Interest: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతూ ఉంటుంది. డబ్బు డిపాజిట్లపై వడ్డీ చెల్లిస్తుంటుంది. అందులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై..

Fixed Deposit Interest: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు.. ఎవరికి ఎంత శాతం..!
Follow us on

Fixed Deposit Interest: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతూ ఉంటుంది. డబ్బు డిపాజిట్లపై వడ్డీ చెల్లిస్తుంటుంది. అందులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తూ ప్రకటిస్తుంటుంది. వినియోగదారులు ఎక్కువగా ఫిక్స్‌డిపాజిట్‌ (ఎఫ్‌డీ)లో డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు మంచి రాబడి రావాలనే చూస్తుంటారు. డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టేవారు ఎక్కువగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు వంటి ప్రభుత్వ బ్యాంకులపై మొగ్గు చూపుతుంటారు. అయితే ఎస్‌బీఐ అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు ఎస్‌బీఐలో డబ్బులు పెట్టుబడి పెట్టడం సరైందేనని భావిస్తుంటారు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. అయితే సాధారణ ప్రజలకు, సీనియర్‌ సిటిజన్స్‌కు ఎస్‌బీఐ ఎఫ్‌డీకి సంబంధించిన వడ్డీ రేట్లపై తెలుసుకుందాం. వాస్తవానికి ఎస్‌బీఐ కస్టమర్లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో బ్యాంకులో ఎంత పెట్టుబడి పెడితే అంత ఎక్కువగా వడ్డీ రేటు వస్తుంటుంది.

ఎంత కాలానికి ఎవరికి ఎంత వడ్డీ వర్తిస్తుంది..

7 నుంచి 45 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 2.90 శాతం వడ్డీ రేటు ఉండగా, సీనియర్‌ సీటిజన్లకు 3.40 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. అలాగే 46 నుంచి 179 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 3.90 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 4.40 శాతం వడ్డీ లభిస్తుంది. 180 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు సాధారణ కస్టమర్లకు 3.90 శాతం వడ్డీ లభిస్తుండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 4.90 శాతం వడ్డీ లభిస్తుంది. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు సాధారణ కస్టమర్లకు 5 శాతం వడ్డీ లభిస్తుండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 5.40 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 2 నుంచి 3 సంవత్సరాల వరకు సాధారణ కస్టమర్లకు 5.10 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 5.60 చొప్పున వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే 3 నుంచి 5 సంవత్సరాల వరకు సాధారణ కస్టమర్లకు 5.30 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 5.80 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇక 5 నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ కస్టమర్లకు 5.40 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 6.20శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.

ఇవీ కూడా చదవండి

JioFiber: రిలయన్స్‌ జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

Home Loan EMI: మీరు గృహ రుణం తీసుకుంటున్నారా..? అయితే ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడం ఎలా..?