SBI offer: ఎస్‌బీఐ కస్టమర్లకు బంపరాఫర్‌.. ఈ పండక్కి షాపింగ్ చేసే వారికి..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన రూపే డెబిట్‌ కార్డ్‌ దారులకు పండగ నేపథ్యంలో భారీ ఆఫర్‌ ప్రకటించింది. ఇందులో భాగంగానే బ్యాంక్‌ కూపన్ కోడ్‌లను అందించింది. దీని ద్వారా కస్టమర్లు భారీ డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఈ విషయాన్ని ఎస్‌బీఐ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం రూపే కార్డుతో ఎజియో, జీవా, మింత్రా యాప్‌లలో కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయి...

SBI offer: ఎస్‌బీఐ కస్టమర్లకు బంపరాఫర్‌.. ఈ పండక్కి షాపింగ్ చేసే వారికి..
SBI Shopping
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 29, 2023 | 10:18 PM

ప్రస్తుతం దేశంలో పండగల సీజన్‌ నడుస్తోంది. మొన్నటి వరకు దసరా వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. దసరా వేడుకలు ఇలా ముగిశాయో లేదో, దీపావళి వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డాయి ఈ కామర్స్‌ సంస్థలు. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్ సేల్స్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన రూపే డెబిట్‌ కార్డ్‌ దారులకు పండగ నేపథ్యంలో భారీ ఆఫర్‌ ప్రకటించింది. ఇందులో భాగంగానే బ్యాంక్‌ కూపన్ కోడ్‌లను అందించింది. దీని ద్వారా కస్టమర్లు భారీ డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఈ విషయాన్ని ఎస్‌బీఐ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం రూపే కార్డుతో ఎజియో, జీవా, మింత్రా యాప్‌లలో కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయి. పండుగ సీజన్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డుతో ఎజియోలో కొనుగోలు చేస్తే రూ. 1500 కంటే ఎక్కువ కొనుగోళ్లపై రూ. 300 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. RUP300AJ కూపన్‌ కోడ్‌ను ఉపయోగించడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందొచ్చు.

ఇక జీవా యాప్‌ ద్వారా ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేసిన డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. అయితే ఇది కేవలం వెండి అభరణాలకు మాత్రమే పరిమితం. రూపే కార్డుతో రూ. 999 అంతకంతే, ఎక్కువ విలువైన వెండిని కొనుగోలు చేస్తే రూ. 300 డిస్కౌంట్‌ అందిస్తారు. THR-RUPAY300 కోడ్‌ను ఉపయోగించడం ద్వారా ఈ డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఇక మింత్రా యాప్‌లో ఎస్‌బీఐ కార్డును ఉపయోగించి రూ. 999 అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే 15 శాతం డిస్కౌంట్‌ పొందుతారు. ఇందుకోసం MYRUPAY15 కోడ్‌ని ఉపయోగించాలి.

ఇదిలా ఉంటే ఎస్‌బీఐ రూపే కార్డుతో మాత్రమే కాకుండా ఎస్‌బీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి కూడా డిస్కౌంట్స్‌ అందించనున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్స్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 27 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, రియలన్స్‌ రిటైల్, వెస్ట్‌సైడ్‌, మ్యాక్స్‌, తనిష్క్‌, టీబీజెడ్‌ వంటి వాటిలో కొనుగోలు చేసే వారికి డిస్కౌంట్ లభించనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..