కేవైసీ డీటెయిల్స్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉందా.? అయితే అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

|

Feb 03, 2021 | 4:34 PM

SBI KYC 2021: ఏదైనా ఒక డాక్యుమెంట్ ప్రూఫ్‌తో.. మీ దగ్గరలో ఉన్న బ్యాంకును సంప్రదిస్తే.. కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఇక ఈ ప్రక్రియకు సంబంధించి..

కేవైసీ డీటెయిల్స్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉందా.? అయితే అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..
Follow us on

SBI KYC 2021: ఏదైనా ఒక డాక్యుమెంట్ ప్రూఫ్‌తో.. మీ దగ్గరలో ఉన్న బ్యాంకును సంప్రదిస్తే.. కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఇక ఈ ప్రక్రియకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు పలు సూచనలు ఇచ్చింది. అయితే అసలు కేవైసీ అంటే ఏంటి.? అది ఎలా ఉపయోగపడుతుంది. అది పూర్తి చేయడానికి ఏయే డాక్యుమెంట్స్ సమర్పించాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

వినియోగదారులు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ కేవైసీ ప్రక్రియను ఉపయోగిస్తారు. అందుకే దీన్ని కస్టమర్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. KYC కోసం బ్యాంకులు.. కస్టమర్ల దగ్గర నుంచి ప్రాథమిక వివరాలను సేకరించి వాటిని ధృవీకరించాల్సి ఉంటుంది. కేవైసీ అప్‌డేట్ కోసం వినియోగదారులు తమ దగ్గరలోని బ్యాంకులో పాస్‌పోర్ట్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎన్‌పీఆర్ లెటర్‌లలో ఏదైనా ఓ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

కేవైసీ అప్‌డేట్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

  • పాస్‌పోర్ట్
  • ఓటర్ కార్డు
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఆధార్ కార్డు
  • పాన్ కార్డు
  • ఎన్‌పీఆర్ లెటర్‌

ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు తమ కస్టమర్ల కేవైసీ డీటెయిల్స్‌ను ప్రతీసారి అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కస్టమర్ కేవైసీ వివరాలైనా పెండింగ్‌లో ఉంటే.. వారికి ఎస్‌ఎంఎస్ ద్వారా అలెర్ట్ పంపాలి. అంతేకాక బ్యాంకులు కస్టమర్ కేవైసీ నిబంధనలు అతిక్రమిస్తే.. ఆర్బీఐ భారీ జరిమానాలు విదిస్తుంది. కాగా, వాణిజ్య బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు, మైక్రోఫైనాన్స్ సంస్థలు కూడా ఈ ఆర్బీఐ నిబంధనలు వర్తిస్తాయి.

Also Read:

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. వరుసగా రెండో రోజు ఎంతంటే.!

ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..

రోజుకో ట్విస్ట్ ఇస్తున్న మదనపల్లె మర్డర్ కేసు.. హత్యల తర్వాత కూడా వారి సోషల్ మీడియా ఖాతాలు యాక్టివ్‌లోనే.?