
భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ప్రతిఒక్కరూ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. అలాగే భారతీయ బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న టెక్నాలజీ వల్ల కస్టమర్ల సౌలభ్యం కోసం వివిధ సేవలను అందిస్తున్నాయి. అయితే ఆయా సేవల వివరాల కోసం బ్యాంక్‌కు వెళ్లే ఖాళీ ఎవరికీ ఉండదు. దీంతో ఇండియాలో అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల సౌలభ్యం కోసం వివిధ రకాల ఆన్‌లైన్ సేవలను, మొబైల్ సేవలను అందిస్తుంది. తాజాగా ఎస్‌బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సేవల ద్వారా కస్టమర్ బ్యాంకును సందర్శించకుండానే బ్యాంకింగ్ విచారణలన్నింటినీ చేసుకోవచ్చు. వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా అందించే సేవలు, వాట్సాప్ బ్యాంకింగ్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఓ సారి చూద్దాం.
ప్రస్తుతం ఎస్‌బీఐ వాట్సాప్ ద్వారా 9 బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఎస్‌బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మీరు పొందగల సేవల జాబితాను ఓ సారి చూద్దాం.