Income Tax: మీరు పరిమితి కంటే ఎక్కువ సంపాదించినప్పుడు, ఆదాయపు పన్ను విధించడం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం పన్ను రహిత పరిమితి ఏడాదికి రూ.2.5 లక్షలు. ఆ తర్వాత రూ. 5 లక్షల వరకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంపై 5 శాతం పన్ను విధిస్తుంటుంది ఆదాయపు పన్నుశాఖ. 2.5 లక్షల పరిమితిని దాటిన తర్వాత మీరు పన్ను ఆదా చేయడానికి ప్రయత్నిస్తారు. దీనికి వివిధ పన్ను మినహాయింపు నిబంధనలు ఉన్నాయి. మీ తల్లిదండ్రుల సహాయం తీసుకుంటే కూడా పన్ను ఆదా చేయవచ్చని పన్ను నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం 5 లక్షల వరకు పన్ను విధించదగిన ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు.
సర్టిఫైడ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA)ముఖేష్ కుమార్ ఝా తెలిపిన వివరాల ప్రకారం.. మీ తల్లిదండ్రులకు పన్ను విధించదగిన ఆదాయం లేకపోతే మీరు వారి కోసం పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేయాలి. పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేసుకోండి. ఇది పన్ను మినహాయింపును ఇస్తుంది. పోస్టాఫీసులోని చిన్న పొదుపు పథకాలు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లు, ఇతర రకాల పన్ను ఆదా పథకాలలో తల్లిదండ్రుల పేరు మీద పెట్టుబడులు పెట్టవచ్చు.
సీనియర్ సిటిజన్లకు అధిక పన్ను మినహాయింపు:
పన్ను మినహాయింపు పరిమితి సీనియర్ సిటిజన్లకు రూ. 3 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షలు. సీనియర్ సిటిజన్లు వడ్డీ ఆదాయంపై రూ. 50,000 వరకు మినహాయింపు పొందుతారు. సాధారణ ప్రజలకు ఈ పరిమితి రూ. 10,000. పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెడితే మీరు పన్నులో రెట్టింపు ప్రయోజనం పొందుతారు.
తల్లిదండ్రుల పేరు మీద ఆరోగ్య బీమాను కొనుగోలు చేయండి:
మీరు మీ సీనియర్ సిటిజన్ పేరెంట్స్ పేరుతో ఆరోగ్య బీమాను కొనుగోలు చేసినప్పటికీ మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది. తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే పన్ను మినహాయింపు రూ. 50 వేలు. మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే మీరు 25 వేల మినహాయింపు ప్రయోజనం పొందుతారు. సెక్షన్ 80డి కింద ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.
మీరు ఉద్యోగం చేస్తూ మీ తల్లిదండ్రులతో నివసిస్తున్నట్లయితే వారి పేరు మీద ఇల్లును కూడా అద్దెకు ఇస్తే పన్ను మినహాయింపు పొందవచ్చు. అద్దెపై హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేయవచ్చు. తల్లిదండ్రులు సొంత ఆదాయం పన్ను విధించకపోతే అద్దె ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. మీరు డబ్బులు ఆదాయ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. వారి అద్దె ఆదాయంలో30 శాతం వరకు మినహాయింపు పొందవచ్చు. ఈ సదుపాయం సెక్షన్ 24 కింద అందుబాటులో ఉంది. అద్దె ఆదాయం రూ.1 లక్ష కంటే ఎక్కువగా ఉంటే వారి పాన్ కార్డు అవసరం అవుతుంది.
ఇవి కూడా చదవండి: