భారతదేశ ఆర్థిక మూలాలను బలోపేతం చేసేందుకుగాను దేశీయ కంపెనీలు సాంకేతికత ఆధారంగా వ్యాపారాలను కొనసాగిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యం, భౌగోళిక, బ్యాంకింగ్ అస్థిరతల కారణంగా ఏర్పడిన మాంద్యం నుంచి బయటపడడానికి చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో కూడా భారత్ ఆశా కిరణంగా కనిపిస్తోంది. భారత దేశ బలమైన ఆర్థిక మూలాలే దీనికి కారణంగా చెప్పొచ్చు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్య నిధి విశ్వాసం వ్యక్తం చేయడమే దీనికి నిదర్శనం.
భారత దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్న వాటిలో స్మాల్ అండ్ మిడ్‌సైజ్ బిజినెస్ (SMB)లది కీలక పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వ్యాపారాలకు సాంకేతికత అండ అందించడంలో సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ (SAP) ఎప్పుడూ ముందుంటుంది. ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ స్పేస్‌లో SAP కంపెనీ పెట్టింది పేరు. ఈ క్రమంలో తాజాగా భారతీయ వ్యాపార సంస్థలకు సహాయం చేసేందుకు గాను క్లౌడ్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం.. ERP కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది అభివృద్ధి చెందుతున్న కంపెనీల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.
ఇందులో భాగంగానే ఈ కొత్త వెర్షన్‌పై అవగాహన కల్పించేందుకు, ఇంతకీ వెర్షన్ ద్వారా వినియోగదారులు కొత్తగా ఎలాంటి ఫీచర్లు పొందనున్నారు లాంటి వివరాలను వివరించేందుకు వర్చువల్‌గా సమ్మిట్ నిర్వహించనున్నారు. ఎస్‌ఏపీ గ్రోత్ సమ్మిట్ పేరుతో ఏప్రిల్ 27వ తేదీన ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు.
అభిషేక్ సింఘ్వీ, మేనేజింగ్ డైరెక్టర్, రాజస్థాన్ బరైట్స్ లిమిటెడ్.
అమీ వెబ్, ఫ్యూచర్ టుడే ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, సీఈఓ
పాల్ మారియట్, SAP ఆసియా పసిఫిక్ జపాన్ అధ్యక్షుడు
జూలియా వైట్, చీఫ్ మార్కెటింగ్ అండ్ సొల్యూషన్స్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడు SAP SE.
SAP గ్రోత్ సమ్మిట్ 2023కి సంబంధించి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..