Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాల ప్రభావం భారత్‌కు తాకనుంది. దేశీయంగా కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సన్‌ప్లవర్ నూనె (Sunflower Oil) గత సంవత్సరం మన దేశం (India) 1.89 మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంది. అందులో 70 శాతం ఉక్రెయిన్ (Ukraine), 20 శాతం రష్యా (Russia) నుంచి వచ్చింది. మరో 10 శాతం ఆర్జెంటీనా (Argentina) నుంచి దిగుమతి చేసుకుంది భారత్. నెలకు 2 నుంచి 3 లక్షల టన్నుల ఈ సన్‌ప్లవర్ నూనె దిగుమతి చేసుకుంటోంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ నుంచి సరఫరా నిలిచిపోయింది. తీవ్ర ఉద్రిక్తతలు మరో రెండు, మూడు వారాలు ఇలాగే కొనసాగితే భారత్‌కు తీవ్రమైన ఇబ్బంది కలుగనుంది. ఆయిల్ కొరత తీవ్రంగా ఏర్పడే అవకాశం ఉంది.
గోధుమలు..
ఇక గోధుమలు (Wheat) అధికంగా వినియోగించే దేశాల్లో భారత్ కూడా ఉంది. ప్రపంచ ఎగుమతి చేసే దేశాల్లో రష్యా అగ్రగామిగా ఉంది. గోధుమల అతిపెద్ద నాలుగో ఎగుమతిదారుగా ఉక్రెయిన్ ఉంది. నల్ల సముద్రం ప్రాంతం నుంచి అధికంగా గోధుమలు సరఫరా అవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల వల్ల వీటి సరఫరా నిలిచిపోయినట్లయితే గోధుమల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా (India) వద్ద 24.2 మిలియన్ టన్నుల నిల్వలు ఉండటంతో దేశీయ ఎగుమతిదారులు దీనిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.
మొబైళ్లపైనా ఎఫెక్ట్..
ఇక మొబైళ్లలో (Mobiles) తయారీలో వినియోగించే లోహం పల్లాడియం అతిపెద్ద ఎగుమతిదారుగా రష్యా ఉంది. రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో పల్లాడియం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
టీ కొనుగోలు విషయంలో..
భారత్ నుంచి టీ అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో రష్యా రెండ స్థానంలో ఉంది. మన ఎగుమతుల్లో 18 శాతం ఆ దేశానికి వెళ్తాయి. తాజాగా తలెత్తుతున్న పరిణామాల నేపథ్యంలో టీ ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. రష్యాపై విధించిన ఆంక్షలతో చెల్లింపుల విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: