Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్.. ఈ వస్తువుల ధరలు పెరగనున్నాయ్..

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా భారత్‌ (India)పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు దేశాల మధ్య వార్‌ కొనసాగుతుండటంతో ..

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్.. ఈ వస్తువుల ధరలు పెరగనున్నాయ్..

Updated on: Mar 08, 2022 | 2:38 PM

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా భారత్‌ (India)పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు దేశాల మధ్య వార్‌ కొనసాగుతుండటంతో కొన్ని వస్తువుల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ యుద్ధం ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే ముడి సరుకుల కొరత ఏర్పడింది. ముడి చమురు, ప్రధాన లోహాలు,అనేక ఖనిజాలు, ఎడిబుల్‌ ఆయిల్‌ వంటి వాటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రష్యా (Russia), ఉక్రెయిన్‌ (Ukraine)లో పేలుళ్ల కారణంగా భారత స్టాక్‌ మార్కెట్లు (Stock Market)కూడా నష్టాల్లో  ఉంటున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు లక్షల కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇవి ఖరీదైనవి

కార్లు, ఎలక్ట్రిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లోహాలు, ఖనిజాల ధరల కారణంగా అన్ని వస్తువులు ఖరీదైనవిగా మారనున్నాయి. ఇదే సమయంలో ఎడిబుల్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అల్యూమినియం టన్ను రికార్డు ధర 3,935 డాలర్లకు చేరుకుంది. బొగ్గు 18 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. నికెల్ $ 30,000, బంగారం కూడా ఔన్సు $ 2,000 దాటింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి:

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ నుంచి మరో బిగ్‌ ఆఫర్స్‌.. ఎప్పటి నుంచి అంటే..!

Vehicle Tires: టైర్లు నలుపు రంగులో ఎందుకు ఉంటాయి.. అసలైన కారణాలు ఏమిటో తెలిస్తే..