Independence Day 2022: 75 సంవత్సరాలలో డాలర్‌తో రూపాయి ఎందుకు ఓడిపోయిందంటే.. అసలు కారణాలు ఇవే..

|

Aug 15, 2022 | 9:08 PM

75 సంవత్సరాలలో భారత కరెన్సీ రూ.4 నుంచి రూ. 80 వరకు ప్రయాణించింది. ఎందుకు ఇలా జరిగింది..?

Independence Day 2022: 75 సంవత్సరాలలో డాలర్‌తో రూపాయి ఎందుకు ఓడిపోయిందంటే.. అసలు కారణాలు ఇవే..
Rupees Journey Since Indias
Follow us on

డాలర్‌తో పోల్చితే.. రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతుండడం తెగ టెన్షన్‌ పెడుతోంది. అయితే భారతదేశం 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. గత 75 ఏళ్లలో భారతదేశం ఆర్థికంగా చాలా పురోగతి సాధించింది. ఇప్పుడు భారత్‌ను 2047లో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ 75 ఏళ్లలో భారత కరెన్సీ కూడా చాలా ముందుకు వచ్చింది. ఏ దేశ కరెన్సీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలాన్ని కొలవడానికి బేరోమీటర్‌గా పరిగణించబడుతుంది. 75 ఏళ్లలో భారత కరెన్సీ రూపాయి 4 నుంచి 80 రూపాయలకు చేరుకుంది.  

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఒక డాలర్ విలువ 4 రూపాయలకు సమానం. ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. ఆర్థిక సంక్షోభం నుండి ఆహార ధాన్యాలు, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింపు వరకు ఎదుర్కోవలసి వచ్చింది. భారత్-చైనా యుద్ధం, భారత్-పాకిస్తాన్ యుద్ధం చెల్లింపు సంక్షోభానికి దారితీసింది. ఖరీదైన దిగుమతి బిల్లుల కారణంగా భారతదేశ విదేశీ మారక నిల్వలు ఖాళీగా ఉండేవి. భారత్‌ డిఫాల్ట్‌ అంచున ఉంది. అప్పుడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రూపాయి విలువను తగ్గించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఒక డాలర్‌తో రూపాయి విలువ 4.76 నుంచి 7.5 రూపాయలకు పడిపోయింది.  

1991లో మరోసారి భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుంది. భారతదేశం తన దిగుమతి అవసరాలను తీర్చడానికి విదేశీ మారకద్రవ్యం కలిగి లేదు. అప్పు కట్టేందుకు డబ్బులు లేవు. భారత్ మళ్లీ డిఫాల్ట్ అంచున నిలిచింది. ఆ తర్వాత చారిత్రక ఆర్థిక సంస్కరణ నిర్ణయం తీసుకున్నారు.  

సంక్షోభాన్ని నివారించడానికి, RBI రెండు దశల్లో రూపాయి విలువను తగ్గించింది. మొదట 9 శాతం, తరువాత 11 శాతం. ఈ విలువ తగ్గింపు తర్వాత ఒక డాలర్‌తో రూపాయి విలువ 26 రూపాయలుగా మారింది. అంటే స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో రూపాయి విలువ రూ.4 నుంచి రూ.79 నుంచి రూ.80 స్థాయికి దిగజారింది. అంటే 75 ఏళ్లలో రూపాయి 75 రూపాయలు బలహీనపడింది. రూపాయి బలహీనతకు అనేక కారణాలున్నాయి. ముడి చమురు దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు పెరిగింది. ఇది దాదాపు 31 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశానికి ఎలాంటి నష్టం జరగలేదు. 

మరిన్ని బిజినెస్, జాతియ వార్తల కోసం..