Rupee: రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి.. డాలర్‌తో 77.72 వద్ద స్థిరపడిన భారతీయ కరెన్సీ..

|

May 19, 2022 | 6:49 PM

డాలర్‌(Doller)తో రూపాయి(Rupee) విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. స్టాక్ మార్కెట్(Stock Market) బలహీనత మధ్య నేడు డాలర్‌తో రూపాయి కొత్త కనిష్ట స్థాయిలలో ముగిసింది...

Rupee: రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి.. డాలర్‌తో 77.72 వద్ద స్థిరపడిన భారతీయ కరెన్సీ..
Money
Follow us on

డాలర్‌(Doller)తో రూపాయి(Rupee) విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. స్టాక్ మార్కెట్(Stock Market) బలహీనత మధ్య నేడు డాలర్‌తో రూపాయి కొత్త కనిష్ట స్థాయిలలో ముగిసింది. వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో రూపాయి పతనం కావడం విశేషం. అదే సమయంలో గత 10 సెషన్లలో రూపాయి 5 సార్లు రికార్డు స్థాయికి చేరుకుంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించి 77.72 వద్ద ముగిసింది. అదే సమయంలో రూపాయి ట్రేడింగ్‌లో 77.76 వద్ద రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుంది. ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుండి నిధుల ఉపసంహరణ వంటి అనేక అంశాలు రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి.

ఈరోజు కరెన్సీ మార్కెట్‌లో రూపాయి పతనంతో ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో రూపాయి ఇంట్రాడేలో 77.76 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత రూపాయి 77.63 వద్ద కోలుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, రూపాయి 10 పైసలు క్షీణించి 77.72 వద్ద ముగిసింది. ఇది రూపాయిలో ఎన్నడూ లేని కనిష్ట స్థాయి. బుధవారం నాడు రూపాయి 18 పైసలు నష్టపోయి 77.62 వద్ద ముగిసింది. ముడి చమురు ధర కూడా పెరగడం రూపాయి పతనానికి కారణమైంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 108 పెరిగింది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు రూపాయిపై ఒత్తిడి పెంచాయి. బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.1254 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ, విదేశీ మార్కెట్లలో భారీగా పతనమైనప్పటికీ డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్ప స్థాయిలోనే ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫారెక్స్ అనలిస్ట్ గౌరంగ్ సోమయ్య తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..