Rupee at Record Low: మరింత బక్కచిక్కిన రూపాయి మారకం విలువ.. రికార్డు కనిష్ఠ స్థాయికి..

|

Jul 01, 2022 | 10:38 AM

Rupee Value: అమెరికా డాలర్‌తో పోలిస్తే  శుక్రవారం ఉదయం ట్రేడ్‌లో రూపాయి మారకం విలువ మరింత క్షిణించి రికార్డు కనిష్ఠ స్థాయికి చేరింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ లో స్థాయిలో..

Rupee at Record Low: మరింత బక్కచిక్కిన రూపాయి మారకం విలువ.. రికార్డు కనిష్ఠ స్థాయికి..
Rupee Value
Follow us on

Rupee Value: రూపాయి మారకం విలువ రోజురోజుకూ బక్కచిక్కిపోతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే  శుక్రవారం ఉదయం ట్రేడ్‌లో రూపాయి మారకం విలువ మరింత క్షిణించి రికార్డు కనిష్ఠ స్థాయికి చేరింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ లో స్థాయిలో 14 పైసలు నష్టపోయి 79.11కు పడిపోయింది. ఫోరెక్స్‌లో రూపాయి మారకం విలువ ఈ స్థాయికి క్షీణించడం ఇదే తొలిసారి. కొద్ది సేపటి క్రితం రూపాయి విలువ 9 పైసలు నష్టపోయి 79.06 వద్ద ట్రేడింగ్ అవుతోంది. క్రితం ముగింపుతో పోల్చితే రూపాయి మారకం విలువ 0.12 శాతం క్షీణించింది.

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో త్వరలోనే రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చితే మరింత క్షీణించే అవకాశముందని అంచనావేస్తున్నారు. డాలర్‌తో పోల్చితే 80 – 81 స్థాయికి రూపాయి వాల్యూ పడిపోయే అవకాశముందని  అంచనావేస్తున్నారు ఆర్థిక నిపుణులు.

అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా రూపాయి మారకం విలువ క్షీణిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే మోడీ ప్రభుత్వ చేతగానితనం, లోపభూయిష్ట ఆర్థిక విధానాల కారణంగానే రూపాయి మారకం విలువ రోజురోజుకూ క్షీణిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..