Rupee: కరెన్సీ ట్రేడింగ్ లో భారత రూపాయి గత కొన్ని రోజులుగా బలం పుంజుకుంటోంది. ఈ జోరు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లోనూ కొనసాగింది. దీనికి ప్రధానంగా.. డాలర్ బలహీనత, క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం వంటివి కారణాలుగా నిలుస్తున్నాయి. ఇందువల్ల రూపాయి వరుస లాభాలతో ట్రేడ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక డాలర్‌కు 11 పైసలు పెరిగిన రూపాయి మారకపువిలువ 74.55కి చేరింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందన్న సానుకూల ఆశల మధ్య క్రూడ్ ఆయిల్ ధరలు కొంత మేరకు తగ్గాయి. ఇది రూపాయి విలువ పెరిగేందుకు దోహదపడింది. తాజాగా డాలర్ ఇండెక్స్ 0.26 శాతం తగ్గి 95.79కి చేరుకుంది.
ఇవీ చదవండి..
Edible Oil Prices: భారత్‌లో మళ్లీ పెరుగుతున్న వంట నూనె ధరలు.. ఎందుకో తెలుసా..?
IRCTC: రైలు ప్రయాణికులకు శుభవార్త.. అలా టిక్కెట్లను బుక్ చేసుకోండి.. బహుమతులు పొందండి..