
ఆర్థిక విషయాలకు సంబంధించి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇక విధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు వాడుకలో ఉన్న నోట్లు (డాలర్, రూపాయి వంటి ఫియాట్ కరెన్సీలు) భవిష్యత్తులో కేవలం కాగితపు ముక్కలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని అన్నారు.
ఆ టైమ్‌లో మిమ్మల్ని రక్షించేది బంగారం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. రాబర్ట్ కియోసాకి ఫియాట్ కరెన్సీల పతనంపై చేసిన ఈ హెచ్చరిక ఇప్పుడు సంచలనంగా మారింది. ఇష్టమొచ్చినట్లు ప్రభుత్వాలు నోట్లు ముద్రించడం, పెరిగిపోతున్న దేశాల అప్పుల భారం వల్ల కరెన్సీ తన అసలు విలువను కోల్పోతోందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం అనే భూతం మీ జేబులోని డబ్బును తినేస్తోందని హెచ్చరిస్తున్నారు. ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తినప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి. కానీ బంగారం ఎప్పుడూ తన విలువను కోల్పోదని అన్నారు. కొన్ని ఏళ్లుగా బంగారం తన విలువను నిలుపుకుంది. దీనిని ఏ ప్రభుత్వం కూడా కావాలని సృష్టించలేదు, కనుక దీని విలువను తగ్గించలేరు.
యుద్ధాలు, రాజకీయ అస్థిరత ఉన్న సమయంలో బంగారం పెట్టుబడిదారులకు ఒక ‘సేఫ్ హెవెన్’ లాంటిది. కేవలం బంగారం మీద మాత్రమే కాకుండా, భవిష్యత్తు ఆర్థిక షాక్‌ల నుంచి తప్పించుకోవడానికి కియోసాకి ఒక మూడు అంచెల వ్యూహాన్ని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక స్థిరత్వం కోసం బంగారం , తక్కువ ధరలో లభించే వెండి, డిజిటల్ యుగంలో విప్లవాత్మక ఆస్తిగా బిట్‌కాయిన్‌ను సూచించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి