Gold Rates: బంగారం ధరలపై బ్లాస్టింగ్ న్యూస్.. త్వరలో మరింత పతనం..! కొత్త లెక్కలివే..

గత కొద్ది రోజులుగా బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. భారీగా పతనాన్ని నమోదు చేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయనే దానిపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి అభిప్రాయాలపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే..

Gold Rates: బంగారం ధరలపై బ్లాస్టింగ్ న్యూస్.. త్వరలో మరింత పతనం..! కొత్త లెక్కలివే..
Gold

Updated on: Jun 24, 2026 | 12:39 PM

బంగారం ధరలపై ప్రముఖ ఇన్వెస్టర్, రిడ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గోల్డ్ రేటపై ఆయన తాజాగా ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని రాసుకొచ్చారు. గోల్డ్ రేట్లలోని హెచ్చుతగ్గులపై ఆయన సోషల్ మీడియా వేదికగా తన అంచనాలను వెల్లడిస్తూ ఉంటారు. ఇటీవల ధరలు మరింత పెరుగుతాయని వెల్లడించిన ఆయన.. తాజాగా మరో ఆసక్తికర విషయం పంచుకున్నారు. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్లు క్రాష్ అవుతుండగా.. ఈ తరుణంలో రాబర్ట్ కియోసాకి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇంతకు ఆయన ఏమన్నారు..? గోల్డ్ రేట్లపై ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

రాబర్ట్ కియోసాకి అంచనాలు..

“శుభవార్త: బంగారం ధర తగ్గుతోంది. టెక్నికల్ చార్టులలో మార్పు కోసం ఎదురుచూస్తున్నాను. ఆ తర్వాత మరింత కొనుగోలు చేస్తాను” అంటూ రాబర్ట్ కియోసాకి ఎక్స్‌లో రాసుకొచ్చారు. అంతకముందు కూడా బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయనే విషయంపై కూడా ఆయన స్పందించారు. “ఏదైనా ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి ధరను మాత్రమే ఆధారంగా తీసుకోకూడదు. నేను ధరను కాకుండా ఆ ఆస్తి ఉన్న ‘సందర్భాన్ని’ లేదా వాతావరణాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకున్నాను. రియల్ ఎస్టేట్ ధర కుప్పకూలుతుంటే.. నేను ఆ ఆస్తి చుట్టుపక్కల ప్రాంతాన్ని చూస్తాను. బంగారం, వెండి విషయంలో నేను మన రాజకీయ, బ్యాంకింగ్ నాయకులను గమనిస్తాను. వీళ్లు అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల సమస్యలను పరిష్కరిస్తున్నారా లేక పరిస్థితులను మరింత దిగజారుస్తున్నారా? అనేది చూస్తాను మన ప్రపంచ నాయకులు అసమర్థులని, పరిస్థితులను మరింత దిగజారుస్తున్నారని నేను భావిస్తున్నాను. అందుకే నేను టెక్నికల్ చార్టులలో బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం ధరలను గమనిస్తున్నాను. ధరలు వాటి పతనాన్ని తిప్పికొట్టినప్పుడు కొంటాను. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడానికి సిద్ధంగా ఉన్నాయని టెక్నికల్ చార్టులు చూపిస్తున్నాయి. దయచేసి నన్ను నమ్మవద్దు. మీరేమనుకుంటున్నారు? మీరేం చూస్తున్నారు? జాగ్రత్త. ఇది ఒక ఉత్తేజకరమైన సమయం. తెలివైనవారు మరింత ధనవంతులవుతారు.. తెలివిలేనివారు ఏమీ చేయరు..బహుశా వారు అలా చేయడమే తెలివైన పని కావచ్చు” అంటూ రాసుకొచ్చారు.

బంగారం ధరలు పెరుగుతాయా..?

బంగారం ధరలు రానున్న రోజుల్లో పెరుగుతాయని రాబర్ట్ కియోసాకి చెబుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 2035 నాటికి ఔన్సుకు 35 వేల డాలర్లకు చేరుకుంటుందని తాను నమ్ముతున్నట్లు ఇటీవల తెలిపాయి. బంగారం, వెండి లాంటి వాటిని కొనుగోలు చేయాలన ఆయన సూసిస్తూ వస్తున్నారు.

 

Follow Us