Gold: త్వరపడండి.! వెంటనే గోల్డ్ కొంటే పేదోడు ధనవంతుడే.. భయంతో ఆగిపోతే

ఏదైనా ఫంక్షన్‌కు ఇన్విటేషన్ వస్తే చాలు.. మధ్యతరగతి కుటుంబాలు తడుముకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. గిఫ్టుగా ఏదైనా బంగారు వస్తువు కొనుక్కుని వెళ్లాలి. మరి.. మనింట్లోనే పెళ్లి పెట్టుకుంటే.. మన అమ్మాయికే పెళ్లి ఖాయమైతే..! ఇంకేముంది లక్ష టెన్షన్లు ఒకేసారి చుట్టుముట్టేస్తాయి. ఆ వివరాలు

Gold: త్వరపడండి.! వెంటనే గోల్డ్ కొంటే పేదోడు ధనవంతుడే.. భయంతో ఆగిపోతే
Gold

Updated on: Apr 19, 2025 | 7:28 PM

బంగారంపై అంచనాలు పెంచేస్తున్నారు అనలిస్టులు, మార్కెట్‌ పండితులు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన “రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌” పుస్తక రచయిత కియోసాకి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇంట్రస్టింగ్‌గా మారాయి. పేదవాడు బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ కొంటే ధనవంతుడవుతాడని.. ఆయన Xలో పోస్ట్‌ చేశారు. ఇలా ఎందుకు కొనాలో చెబుతున్నారు కియోసాకి. 2035 కల్లా ఔన్స్‌ బంగారం 30వేల డాలర్లకు వెళుతుందన్నారు. ఇక వెండి‌ ధర 3000 డాలర్లకు, ఒక బిట్‌కాయిన్‌ ధర మిలియన్‌ డాలర్లకు చేరుతుందన్నారు. భయంతో ఆగిపోతే తీవ్రంగా నష్టపోతారంటూ పేదలను, మధ్యతరగతిని కియోసాకి హెచ్చరిస్తున్నారు.

మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దగ్గర ఎక్కువ బంగారం ఉందా? భారతీయ మహిళల దగ్గర ఎక్కువ గోల్డ్‌ ఉందా? ఈ పోటీలో మహిళలే మహరాణులు అంటున్నారు నిపుణులు. అసలు RBI దగ్గర ఎంత గోల్డ్‌ నిల్వలు ఉన్నాయి? మహిళా భారతంలో ఎంత పసిడి ఉందో లెక్కలు చూద్దాం.. ముందుగా RBI Gold రిజర్వ్స్‌ ఎంత ఉన్నాయో చూద్దాం. RBI దగ్గర 879 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. దీని విలువ రూ. 6.83 లక్షల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. విదేశీ మారక నిల్వల్లో 11.4 శాతానికి వాటా పెరిగింది. 2019లో ఇది కేవలం 6.7శాతంగా ఉంది. గత కొన్నేళ్లుగా పసిడి నిల్వలు RBI పోగేస్తోంది. 2024లో 72.6 టన్నులు గోల్డ్‌ కొనుగోలు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

ఇక భారతీయ మహిళల దగ్గర ఎంత బంగారపు నిల్వలు ఉన్నాయో చూస్తే.. భారతీయ మహిళల దగ్గర 24 వేల టన్నుల గోల్డ్‌ ఉంది. ప్రపంచంలోని మొత్తం గోల్డ్‌ నిల్వల్లో ఇది 11 శాతం. గృహిణుల దగ్గరే అత్యధిక పసిడి నిల్వలు ఉన్నాయట. ఆభరణాల రూపంలో ఎక్కువగా ఉందట పుత్తడి. అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్‌, IMF నిల్వలను.. మించి భారతీయ మహిళల దగ్గర పసిడి ఉంది. సో..! ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారం నిల్వల్లో 11 శాతం భారతీయ మహిళల దగ్గరే భద్రంగా ఉంది. RBI దగ్గర ఉన్న పసిడి నిల్వల కంటే 30 రెట్లు ఎక్కువగా.. మహిళా లోకం దగ్గర పుత్తడి ఉంది.