ఒకవైపు మండిపోతున్న పెట్రోల్ ధరలు.. మరోవైపు పెరిగిన వాహనాల రేట్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనితో కొత్త బైక్ కొనాలనుకుంటున్నవారికి ముందుగా సెకండ్ హ్యాండ్ బైకుల వైపే మొగ్గు చూపుతున్నారు. అలాంటి వాటిని సెర్చ్ చేసేందుకు చాలా వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. సామాన్య ప్రజానీకానికి తక్కువ ధరల్లో.. ఎక్కువ మైలేజ్‌తో ఉన్న బైకులు అందిస్తున్నాయి. ఈ రోజు మనం అలాంటి మూడు బైకుల గురించి మాట్లాడుకుందాం.
సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేసేందుకు చాలా ఆన్లైన్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి Droom.in వెబ్సైట్. ఈ సైట్లో మీకు అనేక రకాల ఆప్షన్స్ లభిస్తాయి. బేసిక్ నుంచి రేసింగ్ వరకు.. అలాగే హైసీసీ బైకులు కూడా ఉంటాయి. అటు వివిధ బ్రాండ్లకు చెందిన బైక్స్‌ను సైతం ఇక్కడ విక్రయిస్తారు. అందులో ఓ మూడు బైకులు అధిక మైలేజీని ఇచ్చే వాటి గురించి చూద్దాం..
బజాజ్ పల్సర్..
ఈ బైక్‌కు దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2013 మోడల్ బైక్‌ను ఫస్ట్ ఓనర్ విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు ఈ బైక్ 11,000 కి.మీ తిరిగింది. ఇక ఈ బైక్ 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ లభిస్తుంది. 149 సిసి ఇంజిన్.. 14.85 బిహెచ్పి పవర్ ఈ బైక్ సొంతం. కేవలం రూ .29 వేలకు ఈ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4 వి డిస్క్..
2019 మోడల్ రేసింగ్ బైక్ ఇది. ఈ బైక్‌ను ఫస్ట్ ఓనర్ విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 95,000 కిలోమీటర్లు తిరిగిన ఈ బైక్.. 16.10 బిహెచ్పి పవర్.. 160 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీనిని రూ .52 వేలకు మీ సొంతం చేసుకోవచ్చు.
హోండా డ్రీం యుగ..
ఇది 2019 మోడల్. ఈ బైక్‌ను ఫస్ట్ ఓనర్ విక్రయిస్తున్నారు. ఇప్పటిదాకా 12,500 కి.మీ తిరిగింది. 84 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇచ్చే ఈ బైక్.. 110 సిసి ఇంజన్‌తో పని చేస్తుంది. 8.25 బిహెచ్పి పవర్‌తో ఉన్న ఈ బైక్‌ను రూ .43 వేలకు సొంతం చేసుకోవచ్చు.
Also Read:
మీ పర్సులో డబ్బులు నిలవాలంటే.. ఈ వస్తువులు ఉంచుకోకూడదు.! అవేంటంటే..
పాము, ముంగీస మధ్య హోరాహోరీ ఫైట్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే.!
ఓర్నీ దుంపతెగ.! పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ చెప్పాడు.. క్రేజీ వీడియో వైరల్..
డెబ్యూ మ్యాచ్‌లో 19 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. సిక్సర్లు, ఫోర్లతో 202 స్ట్రైక్‌రేట్.!
అందరూ చూస్తుండగా వధూవరుల ముద్దులాట.. వీడియో చూసి తీరాల్సిందే.!
ఈ రాశివారికి అన్నింటా విజయాలే.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!