Revolt RV400: రివోల్ట్ ఎల‌క్ట్రిక్ బైక్ క్రేజ్ మాములుగా లేదుగా… రెండు గంట‌ల్లోనే రూ. 50 కోట్ల‌కుపైగా వ్యాపారం..

|

Jun 21, 2021 | 6:37 PM

Revolt RV400: ప్ర‌స్తుతం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు ఆద‌ర‌ణ బాగా పెరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా ప్ర‌భుత్వాలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు రాయితీలు క‌ల్పించ‌డంతో చాలా సంస్థ‌లు వీటి త‌యారీలోకి అడుగుపెట్టాయి. అయితే మొద‌ట్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల...

Revolt RV400: రివోల్ట్ ఎల‌క్ట్రిక్ బైక్ క్రేజ్ మాములుగా లేదుగా... రెండు గంట‌ల్లోనే రూ. 50 కోట్ల‌కుపైగా వ్యాపారం..
Revold Electricbike
Follow us on

Revolt RV400: ప్ర‌స్తుతం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు ఆద‌ర‌ణ బాగా పెరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా ప్ర‌భుత్వాలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు రాయితీలు క‌ల్పించ‌డంతో చాలా సంస్థ‌లు వీటి త‌యారీలోకి అడుగుపెట్టాయి. అయితే మొద‌ట్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ త‌క్కువ‌ బ‌రువుతో కూడుకున్న చిన్న స్కూటీల‌కు మాత్ర‌మే ప‌రిమితంగా ఉండేది. కానీ ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న పాపుల‌ర్ మోట‌ర్ బైక్‌లకు దీటుగా ఎల‌క్ట్రిక్ బైక్‌లు వ‌స్తున్నాయి. ఈ జాబితాలోకే వ‌స్తుంది భార‌తీయ రివోల్ట్ మోటార్స్ సంస్థ‌.
2019లో ఈ సంస్థ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బైక్ లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుంచి వీటి క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతూ వస్తుంది. తాజాగా రెండు రోజుల క్రితం రివోల్ట్ ఆర్​వీ 400 బైక్ లను సేల్ తీసుకొచ్చిన రెండు గంటల్లోనే బుకింగ్ క్లోజ్ అయినట్లు ప్రకటించింది సంస్థ‌. రివోల్ట్ మోటార్స్ రెండు గంటల వ్యవధిలోనే రూ. 50 కోట్లకు పైగా విలువైన మోటారు సైకిళ్లను విక్రయించింది. ఇక ప్ర‌స్తుతం బైక్‌ల‌ను బుక్ చేసుకున్న వినియోగ‌దారుల‌కు 2021 సెప్టెంబ‌ర్ నుంచి వాహ‌నాల‌ను డెలివ‌రీ చేస్తామ‌ని సంస్థ ప్ర‌క‌టించింది. దీన్ని బట్టే ఈ వాహ‌నాల‌కు ఉన్న క్రేజ్ ఎంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఈ బైక్ విక్ర‌యాలు భారీగా పెర‌గ‌డానికి మ‌రో కార‌ణం వీటి ధ‌ర‌.. ఫేమ్ 2 కింద సబ్సిడీలు లభించడంతో ఆర్​వీ 400 బైక్ ధరను రివోల్ట్ రూ.28,201 మేర తగ్గించింది. రూ.1,19,000 ధరకే బుకింగ్​కు పెట్టింది. ఈ మోడల్ టాప్​ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.

Also Read: Monthly Pension: అద్భుతమైన పాలసీ.. ఒక్కసారి మాత్రమే కట్టండి.. నెలకు రూ. 23 వేల పెన్షన్ తీసుకోండి..

Oil Seed Rates: దేశంలో పెరుగుతున్న నూనె గింజల ధరలు..తగ్గిన ఆవపిండి డిమాండ్

Railway Insurance : రైల్వే ప్రయాణికులకు గమనిక..! 49 పైసలకే 10 లక్షల రైల్వే ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..