RBI New Rules: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా? జరిమానా తప్పదు.. ఆర్బీఐ కొత్త రూల్‌!

|

Mar 24, 2025 | 9:47 PM

RBI New Rules: రిజర్వ్ బ్యాంక్ బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త నియమాలను జారీ చేసినందున బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఈ కొత్త మార్పు జరిగింది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొత్త నియమాలను, ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నందుకు విధించే జరిమానాను వివరంగా తెలుసుకుందాం..

RBI New Rules: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా? జరిమానా తప్పదు.. ఆర్బీఐ కొత్త రూల్‌!
Follow us on

RBI New Rules: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌ లావాదేవీలనే ఎక్కువగా జరుపుతున్నారు. అయితే చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉండటం సర్వసాధారణం అయిపోయింది. కొందరికి ఒకటికంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని చిక్కుల్లో చిక్కునేలా చేస్తాయి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటే అధిక జరిమానాలు విధించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది . రిజర్వ్ బ్యాంక్ బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త నియమాలను జారీ చేసినందున బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఈ కొత్త మార్పు జరిగింది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొత్త నియమాలను, ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నందుకు విధించే జరిమానాను వివరంగా తెలుసుకుందాం.

ఆర్‌బిఐ కొత్త కొత్త నియమాలు:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలానుగుణంగా డబ్బు లావాదేవీలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త నియమాలను అమలు చేస్తోంది. అందుకే ఇప్పుడు కొత్త బ్యాంకింగ్ నియమాలను ప్రవేశపెట్టింది. బ్యాంకు ఖాతాల ద్వారా నకిలీ డబ్బు లావాదేవీలు, మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.

ఇది కూడా చదవండి: March 31: సమయం లేదు మిత్రమా..! మార్చి 31 వరకు అవకాశం.. భారీ బెనిఫిట్స్‌!

ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే జరిమానా:

ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండి, ఆ ఖాతాలో ఏవైనా మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తేలితే, అధిక జరిమానా విధించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బహుళ నకిలీ లావాదేవీలు జరిగితే, రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుందని, ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తూ అక్రమ లావాదేవీలు జరిగినట్లయితే చర్యలు తప్పవని ఆర్బీఐ హెచ్చరించింది. జరిమానా విధించబడిన వ్యక్తి జరిమానా చెల్లించడంలో విఫలమైతే బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ఆర్‌బిఐ అనుమతి ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తికి ఎక్కువ బ్యాంకుల్లో రెండు లేదా ఎక్కువ ఖాతాల్లో ఏదైనా అనుమానంగా లావాదేవీలు జరిగితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలని ఖాతాను సరిగ్గా నిర్వహించడం తప్పనిసరి.

ఇది కూడా చదవండి: No Fuel: వాహనదారులకు షాక్‌.. ఈ వాహనాలకు ఏప్రిల్ 1 నుండి నో పెట్రోల్, డీజిల్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి