RBI: ఆ బ్యాంకుకు గట్టి షాకిచ్చిన ఆర్బీఐ.. రూ.5వేలకు మించి విత్‌డ్రా చేయలేరు..!

| Edited By: Anil kumar poka

Apr 10, 2022 | 8:16 AM

RBI:  బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) కొరడా ఝులిపిస్తోంది. మార్చి నెలలో సుమారు 8 బ్యాంకుల సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా..

RBI: ఆ బ్యాంకుకు గట్టి షాకిచ్చిన ఆర్బీఐ.. రూ.5వేలకు మించి విత్‌డ్రా చేయలేరు..!
Follow us on

RBI:  బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) కొరడా ఝులిపిస్తోంది. మార్చి నెలలో సుమారు 8 బ్యాంకుల సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా సరైన నిబంధనలు పాటించని బెంగళూరుకు చెందిన కో-ఆపరేటివ్‌ బ్యాంకు (Co-Operative Bank)కు ఆర్బీఐ (RBI) గట్టి షాకిచ్చింది. ఈ ఆపరేటివ్ బ్యాంకు శుశ్రుతి సౌహార్ధ సహకార బ్యాంకు నియమిత (Shushruti Souharda Sahakara Bank Niyamita)నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆర్బీఐ గుర్తించింది. దీంతో బ్యాంకు ఖాతాదారుల విత్‌డ్రాపై ఆంక్షలు విధించింది. ఈ బ్యాంకు ఖాతాదారులు రూ.5వేలకు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీలులేదు. అంతేకాదు.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్యాంకు నుంచి రుణాలు ఇవ్వడం, డిపాజిట్లను తీసుకోవడం చేయరాదని ఆర్బీఐ బ్యాంకుకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు పరిస్థితులు మెరుగు పడేంత వరకు బ్యాంకింగ్‌ ఆపరేషన్స్‌పై ఆంక్షలు కొనసాగుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయంతో ఖాతాదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. కాగా, ఇలా నిబంధనలు సరిగ్గా పాటించని బ్యాంకులపై చర్యలు చేపడుతోంది ఆర్బీఐ. బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానాలు వేస్తుంది. అలాగే బ్యాంకుకు సంబంధించిన ఇతర సేవలపై కూడా ఆంక్షలు విధిస్తోంది.

కాగా, నిబంధనలు పాటించని యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంకుపై శుక్రవారం చర్యలు తీసుకుంది ఆర్బీఐ. భారీగా జరిమానా విధించడమే కాకుండా బ్యాంకు లైసెన్స్‌లను సైతం రద్దు చేసింది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో కనీస నిల్వను నిర్వహించనందుకు విధించాల్సిన ఛార్జీలు, మోసాల నుండి రక్షణ కోసం ప్రత్యేక మార్గదర్శకాలకు సంబంధించిన KYC మార్గదర్శకాలు, నిబంధనలను నెరవేర్చనందుకు బ్యాంకులకు జరిమానా విధించబడింది. యాక్సిస్ బ్యాంక్‌పై రూ.93 లక్షలు, ఐడీబీఐ బ్యాంక్‌పై రూ.90 లక్షలు జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది.

ఇవి కూడా చదవండి:

Forex Reserves: భారత్ వద్ద భారీగా క్షీణించిన విదేశీ మారక నిల్వలు.. వరుసగా నాలుగు వారాల్లో ఎంత తగ్గాయంటే..

Interest Rates: వడ్డీ రేట్ల ప్రభావం సామాన్యులపై ఎలా ఉంటుందో తెలుసా.. ఇన్వెస్టర్ల పరిస్థితి ఏమిటంటే..