Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం.. కొత్త కస్టమర్ల నిలిపివేత

|

Mar 11, 2022 | 6:40 PM

Paytm Payments Bank: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది.పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను కొత్త కస్టమర్‌లను చేర్చుకోకుండా నిలిపివేసింది...

Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం.. కొత్త కస్టమర్ల నిలిపివేత
Follow us on

Paytm Payments Bank: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది.పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను కొత్త కస్టమర్‌లను చేర్చుకోకుండా నిలిపివేసింది.  ఆర్‌బీఐ తన అధికారిక ప్రకటనలో పేటీఎం ఐటి సిస్టమ్‌పై సమగ్ర అడిట్ నిర్వహించడానికి ఆడిట్ సంస్థను నియమించాలని ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 35A కింద దాని అధికారాలను వినియోగించుకుంటూ, కొత్త కస్టమర్లను చేర్చుకోవడం తక్షణమే నిలిపివేయాలని Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ని ఆర్బీఐ ఆదేశించింది.

కాగా, Paytm పేమెంట్స్‌ బ్యాంక్‌ తన కార్యకలాపాలను మే 23, 2017న ప్రారంభించింది. పేటీఎం బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. కంపెనీకి 100 మిలియన్‌ల కస్లమర్లు ఉన్నారు. ప్రతి నెల 0.4 మిలియన్ల వినియోగదారులు చేరుతున్నారు. డిసెంబర్‌ 9న పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం, 1934లోని రెండవ షెడ్యూల్‌లో చేర్చబడిందని, ఇది కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు వీలు కల్పించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్‌ 2021లో కొన్ని నిబంధనలు ఉల్లంఘించినందున ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ద్రవ్య పెనాల్టీని విధించింది. అయితే ఈ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఆర్బీఐ సర్య్కూలర్‌ జారీ చేసింది. ఇక నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకులో గుర్తించిన కొన్ని సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అయితే 2015లో పేటీఎం పేమెంట్స్‌ కోసం ఆర్బీఐ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత 2017లో ఈ సేవలను ప్రారంభించింది పేటీఎం.

 


ఇవి కూడా చదవండి:

Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 86, నిఫ్టీ 35 పాయింట్లు అప్..

EPFO: పీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. ఆ నెంబర్ల గురించి సమాచారం తెలుసుకోండి..!