Reliance: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తొలిసారిగా తన వ్యాపార సామ్రాజ్య వారసత్వంపై పెదవి విప్పారు. గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా కంపనీ ఫ్యామిలీ డే ఫంక్షన్ మంగళవారం(డిసెంబర్28) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ తరం ఇప్పుడు నాయకత్వ పాత్రలు పోషించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తమ కంపెనీలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని తాను కోరుకుంటున్నట్లు ఉద్ఘాటించారు.
“మేము వారికి మార్గనిర్దేశం చేయాలి, వారిని ఎనేబుల్ చేయాలి, వారిని ప్రోత్సహించాలి.. అలాగే వారు మన కంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నందున తిరిగి కూర్చుని చప్పట్లు కొట్టి అభినందించాలి” అని అంబానీ అన్నారు.
అంబానీ, 64, 2002లో తన తండ్రి మరణం తర్వాత RIL ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ముగ్గురు పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్ ఆర్ఐఎల్(RIL)కు సంబంధించిన టెలికాం, రిటైల్, ఇంధన వ్యాపారాలలో పాలుపంచుకున్నారు. ఆర్‌ఐఎల్ బోర్డులో ఎవరూ లేనప్పటికీ, వారు కంపెనీ కీలక శాఖల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. “తరువాతి తరం నాయకులుగా ఆకాష్, ఇషా, అనంత్ రిలయన్స్‌ను ఉన్నత శిఖరాలకు నడిపిస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. నేను ప్రతిరోజూ రిలయన్స్ కోసం వారి అభిరుచి, నిబద్ధత, భక్తిని చూడగలను. లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అలాగే భారతదేశ వృద్ధికి దోహదపడటానికి మా నాన్నకు ఉన్న అదే స్పార్క్, సామర్థ్యాన్ని నేను వారిలో చూస్తున్నాను, ”అని ముఖేష్ అంబానీ చెప్పుకొచ్చారు.
రిలయన్స్ చీఫ్‌గా అంబానీ మొదటి సారి వారసత్వం గురించి మాట్లాడారు..
లిస్టెడ్ కంపెనీలలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవులను విభజించడానికి సెబీ ఏప్రిల్ 2022 గడువు కంటే ముందే ఆయన ప్రకటన వచ్చింది. గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రిలయన్స్ భవిష్యత్తు వృద్ధికి పునాది వేయాల్సిన సమయం ఆసన్నమైందని అంబానీ అన్నారు. టెక్స్‌టైల్ కంపెనీగా ప్రారంభమైన ఆరైఎల్(RIL) వివిధ వ్యాపార ప్రయోజనాలతో కూడిన సమ్మేళనంగా రూపాంతరం చెందింది. దీని ఉత్పత్తులు ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి అని అంబానీ చెప్పారు.
ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఆర్‌ఐఎల్ వార్షిక వాటాదారుల సమావేశంలో , కంపెనీ శిలాజ ఇంధనాల నుంచి వైదొలగడంతో మూడేళ్లలో క్లీన్ ఎనర్జీలో రూ.75,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అంబానీ ప్రకటించారు.
రిటైల్ ..టెలికాం (జియో) వ్యాపారాలపై అంబానీ మాట్లాడుతూ, “గత ఒక సంవత్సరంలోనే, మేము దాదాపు ఒక మిలియన్ చిన్న దుకాణదారులను ఆన్‌బోర్డ్ చేసాము ..దాదాపు లక్ష కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాము. ఈ గ్రోత్ ఇంజిన్ మా భాగస్వాములు ..ఉద్యోగులకు అపరిమిత అవకాశాలను అందించడం ద్వారా గణనీయమైన సామాజిక విలువను సృష్టించడం కొనసాగిస్తుంది. Jio 120 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకుంది ..దాదాపు నాలుగు మిలియన్ల గృహాలు ..వాణిజ్య సంస్థలకు ఫైబర్‌ని అందించింది. కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అయన తన ఉద్యోగులకు సూచించారు.. సాధారణ పరిస్థితులు నెమ్మదిగా తిరిగి వస్తున్నప్పటికీ, అది ఇప్పటికీ అనిశ్చితితో కప్పబడి ఉందని అంబానీ తెలిపారు.
“మనం రిలయన్స్ గోల్డెన్ డికేడ్ రెండవ భాగంలోకి ప్రవేశిస్తున్నప్పుడు, మా కంపెనీ భవిష్యత్తు గతంలో కంటే నాకు ప్రకాశవంతంగా ఉందని నేను మీకు చెప్పగలను. నేను నమ్మకంగా రెండు అంచనాలు వేయగలను. మొదటిది, భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారుతుంది. రెండవది, రిలయన్స్ ప్రపంచంలోని బలమైన ..అత్యంత ప్రసిద్ధ భారతీయ బహుళజాతి కంపెనీలలో ఒకటిగా మారుతుంది.
ఇవి కూడా చదవండి: Silent Heart Attack: నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి..?
Viral Video: తాబేలు కారుపై జోరుగా షికారు .. రేసు కోసం ప్రాక్టీస్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్..