260 ఏళ్ల సంస్థను కొనుగోలు చేసిన రిలయన్స్ బ్రాండ్

| Edited By: Pardhasaradhi Peri

Jul 19, 2019 | 6:42 AM

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ బ్రిటిష్ టాయ్ రిటైలర్ హామ్‌లేస్‌ను కొనుగోలు చేసింది. రూ.620 కోట్లకు (GBP 67.96 మిలియన్లు) క్యాష్ డీల్‌కు సొంతం చేసుకుంది. హామ్‌లేస్ (హామ్‌లేస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్ -HGHL) ప్రముఖ చిన్న పిల్లల ఆటవస్తువులు తయారు చేసే సంస్థ. పిల్లల ఆటవస్తువులు తయారు చేయడంలో సూమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హెచ్‌జీహెచ్‌ఎల్‌ సంస్థ 18 దేశాలలో మొత్తం 167 స్టోర్లను కలిగిఉంది. […]

260 ఏళ్ల సంస్థను కొనుగోలు చేసిన రిలయన్స్ బ్రాండ్
Follow us on

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ బ్రిటిష్ టాయ్ రిటైలర్ హామ్‌లేస్‌ను కొనుగోలు చేసింది. రూ.620 కోట్లకు (GBP 67.96 మిలియన్లు) క్యాష్ డీల్‌కు సొంతం చేసుకుంది. హామ్‌లేస్ (హామ్‌లేస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్ -HGHL) ప్రముఖ చిన్న పిల్లల ఆటవస్తువులు తయారు చేసే సంస్థ. పిల్లల ఆటవస్తువులు తయారు చేయడంలో సూమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హెచ్‌జీహెచ్‌ఎల్‌ సంస్థ 18 దేశాలలో మొత్తం 167 స్టోర్లను కలిగిఉంది. లండన్‌లో ఈ సంస్థకు ఉన్న ఏడంతస్తుల భవనంలో సుమారు 50 వేల రకాల ఆటబొమ్మలు అమ్మకానికి ఉంటాయి. ప్రతి సంవత్సరం దాదాపుగా 50 లక్షల మంది ఈ స్టోర్‌ని సందర్శిస్తూ ఉంటారు. హంకాంగ్‌ షేర్‌మార్కెట్‌లో లిస్ట్‌ అయిన సీ-బ్యానర్‌ ఇంటర్నేషనల్‌ హోల్గింగ్స్‌ నుంచి రిలయన్స్‌ ఈ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు రిలయన్స్‌బ్రాండ్స్‌, హెచ్‌జీహెచ్‌ఎల్‌ సంస్థకు భారత్‌లో ఫ్రాంఛైజీగా ఉంది. గత కొన్నేళ్లుగా పిల్లల ఆటవస్తువుల అమ్మకాలలో రిలయన్స్‌ బ్రాండ్స్‌ లాభాల బాటలో నడుస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అనుబంధ సంస్థ అయిన రిలయన్స్‌ బ్రాండ్స్‌ దేశం మొత్తంమీద 420 స్టోర్‌లను నిర్వహిస్తుంది.