రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన వినియోగదారుల కోసం కీలక ప్రకటనలు చేస్తుంటారు. టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతుంది. ఇతర సంస్థలకు పోటీగా తన బిజినెస్‌ను మరింతగా విస్తరించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది దీపావళికి జియో ఏఐ క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నట్లులో అంబానీ ప్రకటించారు. ఈ ఆఫర్‌లో భాగంగా, రిలయన్స్ జియో తన వినియోగదారులకు 100జీబీ వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజీ సదుపాయాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏఐ ఆధారిత క్లౌడ్ స్టోరేజీలో జియో యూజర్లు తమ ఫొటో లు, వీడియోలు, డాక్యుమెంట్లతోపాటు ఇతర డిజిటల్ కంటెంట్, డేటాను స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుదని అన్నారు. అవసరమైన వారికి అదనపు స్టోరేజిని అత్యంత అందుబాటు ధరలో అందించనున్నట్లు అంబానీ స్పష్టం చేశారు. ఈ సర్వీస్ ద్వారా గూగుల్, యాపిల్‌కు జియో గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. జియో అందించనున్న మరిన్ని ఏఐ సేవల వివరాలు..
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణకు రెడ్ అలర్ట్.. ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించనుందా?
గురువారం జరిగిన రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని ప్రకటించారు. వెల్‌కమ్ ఆఫర్ కింద 100జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందించనున్నామని అన్నారు. ఇక అధిక స్టోరేజీ కావాలనే వినియోగదారుల కోసం అందుబాటు ధరల్లో అందించనున్నట్లు చెప్పారు.
కొత్త JioTV+
వినియోగదారుల కోసం వినోదం కోసం లైవ్ టీవీ, ఆన్-డిమాండ్ షోల కోసం అంబానీ జియో టీవీ ఓఎస్, జియో హోమ్, జియో టీవీ+లను ప్రకటించారు. దీని కింద వినియోగదారులు 860 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను ఆస్వాదించవచ్చు. ఇది మాత్రమే కాకుండా జియో టీవీ+తో వినియోగదారులు Amazon Prime Video, Disney Plus, Hotstar వంటి యాప్‌లకు కూడా యాక్సెస్ పొందుతారు.
ఇది కూడా చదవండి: New Rules: సెప్టెంబర్ నుంచి మారనున్న కీలక మార్పులు ఇవే.. కొత్త నిబంధనలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి