కంపెనీల నుంచి స్మార్ట్ టీవీల సరఫరాలు, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, ఈ ఏడాది జనవరి-మార్చిలో 14% తగ్గాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. వినియోగదారు గిరాకీ పెద్దగా ఉండకపోవడమే ఇందుకు కారణామని వెల్లడించింది. అలాగే ఇప్పటికే డీలర్ల వద్ద స్టాక్స్ అధికంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. అలాగే ఏడాదిలో టీవీల సరఫరాల్లో 10% మేర తగ్గిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. త్రైమాసికంలో చైనా కంపెనీ షియోమీని తోసిరాజని, శామ్‌సంగ్ మళ్లీ అగ్ర స్థానానికి చేరింది. చైనా బ్రాండ్ల స్మార్ట్ టీవీల సరఫరాలు 30% వరకు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. వన్‌ప్లస్, హైయర్, రియల్‌మీ బ్రాండ్ల స్మార్ట్ టీవీలు బాగా తగ్గాయని కూడా తెలిపింది.
శామ్‌సంగ్ టీవీల సరఫరా 40 శాతం తగ్గింపు
ఇదిలా ఉండగా, నివేదికల ప్రకారం.. శామ్‌సంగ్ టీవీ సరఫరా భారీగానే తగ్గింది. 40 శాతం వరకు తగ్గినట్లు వెల్లడించింది. భారతీయ కంపెనీల స్మార్ట్ టీవీల సరఫరాలు 16 శాతంగా ఉండగా, దక్షిణ కొరియా కంపెనీ ఎల్‌జీ సరఫరాలు 43% ఉన్నాయి. మన దేశంలో స్మార్ట్ టీవీ మార్కెట్లో ఎల్‌జీకి 15% మార్కెట్ వాటా ఉంది. చైనా బ్రాండ్లు ఎంఐ 2 శాతం, అలాగే టీసీఎల్ కంపెనీల సరఫరాలు 4శాతం మేర క్షీణించినట్లు తెలుస్తోంది. మన విపణిలో వీటి వాటా వరుసగా 12%, 7 శాతంగా ఉంది. సోనీ కంపెనీ సరఫరాలు 19% వృద్ధిని నమోదు చేయగా, దేశీయంగా ఈ కంపెనీకి 7% వాటా ఉంది.
శామ్‌సంగ్, ఎల్‌జీ, షియోమీ బ్రాండ్ల స్మార్ట్ టీవీలకు గిరాకీ బాగుంది. టాప్-5 కంపెనీల వాటా 2024 తొలి త్రైమాసికంలో 57 శాతానికి చేరింది. 2023 ఇదే సమయంలో ఇది 41 శాతంగానే నమోదైందని రీసెర్చ్ అనలిస్ట్ ఆకాశ్ జత్వాలా వెల్లడించారు. హైసెన్స్, పానసోనిక్, వెస్టెల్, తోషిబా, మోటోరోలా వంటివి వృద్ధి నమోదు చేశాయని, ఇవి క్యూఎల్‌ఈడీ టీవీలను 4కే రెజొల్యూషన్‌తో తక్కువత ధరకే అందిస్తున్నాయని పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..