
రికరింగ్ డిపాజిట్ అనేది చాలా సులభమైన, ఉపయోగకరమైన పొదుపు పథకం. మీరు ప్రతి నెల ఈ డిపాజిట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ మొత్తంలో అందుకునే అవకాశం ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ దాదాపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి సమానమైన వడ్డీని పొందవచ్చు. ఆర్డీ (రికరింగ్ డిపాజిట్) నిర్వహించడం కూడా చాలా సులభం. ఇది ప్రజలలో పొదుపు ధోరణిని పెంచుతుంది. దాదాపు అన్ని బ్యాంకులు రికరింగ్ డిపాజిట్ పథకాన్ని కలిగి ఉన్నాయి. నెలకు కనీసం రూ. 100 నుంచి ప్రారంభించి మీకు కావలసినంత డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. బ్యాంకుల్లోనే కాకుండా పోస్టాఫీసుల్లో కూడా ఆర్డీ ఖాతా తెరవవచ్చు. ఇక్కడ కూడా నెలకు కనీసం రూ.100 పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రికరింగ్ డిపాజిట్ కోసం సంవత్సరానికి 6.5 శాతం నుంచి 7 శాత వరకు వడ్డీ చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్లకు అర శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీఐ రెండు నుంచి మూడు సంవత్సరాల ఆర్డీ పథకం కోసం గరిష్ట వడ్డీని అందిస్తుంది. ఇతర ప్రధాన వాణిజ్య బ్యాంకులు కూడా దాదాపు అదే ఆర్‌డీ రేట్లు కలిగి ఉన్నాయి.
పోస్టాఫీసులో ఆర్‌డీ పథకం 5 సంవత్సరాలు. నెలకు కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాలి. ఈ ఐదేళ్ల ఆర్డీ స్కీమ్‌కు సంవత్సరానికి 6.5 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే, రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. ఆర్‌డీ నుంచి ఏడాదిలో వచ్చే వడ్డీ మొత్తం రూ.10,000 దాటితే వచ్చే ఆదాయం రూ. 10% టీడీఎస్ కట్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి