Real-Time Gross Settlement: కరోనావైరస్ ప్రారంభమైన నాటినుంచి ప్రజలు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్నారు. బయటకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ల ద్వారా ఇంటి నుంచి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు. 2019తో పోల్చితే 2020లో డిజిటల్ చెల్లింపులు 80 శాతం మేర పెరిగినట్టు పలువురు చెబుతున్నారు. జనం ఈ విధానానికే క్రమంగా అలవాటు పడుతుండటంతో ఆరబీఐ ఆర్టీజీఎస్ సేవల్లో పలు కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహించే వారికి ఆర్‌బీఐ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 18న దేశవ్యాప్తంగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) సేవలను 14 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీనిలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆర్టీజీఎస్ సేవలు నిలిచిపోనున్నాయి.
శనివారం సాధారణ కార్యకలాపాలు ముగిసిన తర్వాత అర్థరాత్రి 12గంటల నుంచి ఆర్టీజీఎస్ సేవలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 2 వరకు ఈ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆర్‌టీజీఎస్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్ జరుపుతోంది. డిజాస్టర్ రికవరీ టైమ్‌ని పెంచేందుకు టెక్నికల్ సిస్టంను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటలపాటు ఆర్‌టీజీఎస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అయితే.. ఆర్‌టీజీఎస్ సేవలు నిలిచిపోయిన సమయంలో వినియోగదారులు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ టాన్స్‌ఫర్(నెఫ్ట్) సేవలను వినియోగించుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఈ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని, ఆర్‌టీజీఎస్ సేవలకు మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవాలని సూచించింది.
పేమెంట్స్ కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వినియోగించుకోవాలని సూచించింది. అయితే.. రూ.2 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో భారీగా డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి, లావాదేవీలు జరిపేందుకు ఆర్‌టీజీఎస్ సేవలు ఉపయోగపడతాయి. అయితే నెఫ్ట్ కు మాత్రం ఇలాంటి పరిమితులు లేవు. గతేడాది డిసెంబర్ నుంచి ఆర్టీజీఎస్ సేవలు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఆర్‌టీజీఎస్ వేళలు బ్యాంకుల వేళల్లో మాత్రమే పరిమితంగా ఉండేవి. దేశంలో ఆర్‌టీజీఎస్ సేవలు 2004 మార్చి 26న ప్రారంభమయ్యాయి.
Also Read: