RBI Guidelines: బ్యాంకింగ్ రంగంలో మోసాలు పెరిగిపోతున్నాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. వినియోగదారులు మోసాల్లో పడకుండా ఉండేందుకు కొత్త కొత్త నిబంధనలు తీసుకువస్తుంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు సురక్షితంగా ఉండేందుకు కార్డు టోకనైజేషన్ విధానాన్ని తీసుకువస్తోంది ఆర్బీఐ. దీంతో కార్డుదారులు తమ కార్డును టోకెన్‌గా మార్చుకోవాలి. వ్యాపారి, చెల్లింపు గేట్‌వే కంపెనీ కార్డు చెల్లింపు సమయంలో మీ డేటా, కార్డు వివరాలు సేవ్ చేయలేరు. వీటికి బదులుగా వారు టోకెన్ వివరాలను సేవ్ చేస్తారు. అయితే వాటిని మీరే సృష్టించుకోవచ్చు.
ఇందుకు సంబంధించిన తేదీన ఆర్బీఐ ఖరారు చేసింది. ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్ ప్రకారం.. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. మీరు కార్డు ద్వారా చెల్లింపులు జరిపినట్లయితే కార్డు వివరాలను టోకెన్‌తో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నియమం అమలు చేయాలంటే కొంత సమయం పడుతుంది. మీరు ఎప్పుడైనా కార్డు చెల్లింపును ప్రాసెస్ చేసినప్పుడు కార్డు నెంబర్, కార్డు CVV నెంబర్, ఎక్స్‌పయిరీ తేదీ వంటివి సులభంగా, వేగంగా చెల్లింపుల కోసం వివరాలు డేటాబేస్‌లో స్టోర్ చేయబడి ఉంటాయి. కానీ భద్రతా పరంగా సురక్షితం కాదు. వినియోగదారుల డేటాను హ్యాకర్లు సులభంగా తెలుసుకునే ప్రమాదం ఉంది. దీని వల్ల హ్యాకర్లు మీ అకౌంట్లో ఉన్న మొత్తాన్ని చోరీ చేసే ప్రమాదం ఉంది. దీంతో ఆర్బీఐ ఈ టోకెన్ విధానాన్ని తీసుకువస్తోంది. అయితే ఈ విధానం గత నెలకే గడువు ఉండగా, ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది ఆర్బీఐ. ఇక అక్టోబర్ నుంచి అమల్లోకి రానుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..