RBI Repo Rate: బ్యాంకింగ్‌ వ్యవస్థలో రెపో రేటు.. రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి?

|

Apr 13, 2025 | 11:07 AM

RBI Repo Rate: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని వాణిజ్య బ్యాంకులకు రుణాలను అందిస్తుంది. దానిని రెపో రేటు అంటారు. రెపో రేటు పెరిగినప్పుడు ఆర్బీఐ బ్యాంకులకు ఖరీదైన రుణాలను ఇస్తుంది. బ్యాంకులు రుణ భారాన్ని ఖాతాదారులపై మోపుతాయి..

RBI Repo Rate: బ్యాంకింగ్‌ వ్యవస్థలో రెపో రేటు.. రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి?
Follow us on

సాధారణంగా వినియోగదారులకు బ్యాంకులు రకరకాల రుణాలు అందిస్తుంటాయి. రుణాలపై రకరకాల వడ్డీ రేట్లు ఉంటాయి. ఖాతాదారుని సిబిల్‌ స్కోర్‌ను బట్టి వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. అయితే బ్యాంకులు వినియోగదారులకు అప్పు ఇచ్చినట్లే బ్యాంకులు కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నుంచి కూడా అప్పు తీసుకుంటుంది. వాటికి కూడా వడ్డీ ఉంటుంది. కొన్ని సమయాల్లో బ్యాంకుల వద్ద అధిక మొత్తంలో డబ్బు ఉంటే ఆ డబ్బును ఆర్బీఐ వద్ద డిపాజిట్‌ చేస్తుంటుంది. ఇందు కోసం ఆర్బీఐ కొంత వడ్డీని చెల్లిస్తుంది. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ అప్పుడప్పుడు నిర్వహించి సమావేశంలో వినియోగదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటుంది.
ఇటీవల దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ దేశంలోని కోట్లాది మందికి రుణ ఈఎంఐలలో ఉపశమనం కల్పించింది. . ఆర్బీఐ MPC వరుసగా రెండవసారి రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. ఆ తర్వాత రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది.

రెపో రేటు అంటే ఏమిటి?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని వాణిజ్య బ్యాంకులకు రుణాలను అందిస్తుంది. దానిని రెపో రేటు అంటారు. రెపో రేటు పెరిగినప్పుడు ఆర్బీఐ బ్యాంకులకు ఖరీదైన రుణాలను ఇస్తుంది. బ్యాంకులు రుణ భారాన్ని ఖాతాదారులపై మోపుతాయి. గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. ద్రవ్యోల్బణ రుణాలను తగ్గించేందుకు ఆర్‌బిఐ మార్కెట్లో లిక్విడిటీని తగ్గిస్తుంది. ఇందుకోసం రెపో రేటును పెంచింది.

రివర్స్ రెపో రేటు:

ఆర్బీఐ ఈ రకమైన రివర్స్ రెపో రేటు కింద వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుంది. అంటే ఈ బ్యాంకులు ఆర్బీఐ వద్ద డబ్బును డిపాజిట్ చేస్తాయి. ఆర్‌బీఐ దానిపై వడ్డీ చెల్లిస్తుంది. ఈ వడ్డీరేట్లలో కూడా మార్పులు జరుగుతుంటాయి. రివర్స్ రెపో రేటు శాతాన్ని గ‌తంలో రెపో రేటు వ‌డ్డీ శాతానికి సంబంధం లేకుండా నిర్ణయించేవారు. 2011 నుంచి దీంట్లో మార్పులు తీసుకొచ్చారు. అప్పట్లో ఆర్బీఐ దీనిని రెపో రేటుతో అనుసంధానం చేసింది. రెపో రేటు మారినప్పుడల్లా రివ‌ర్స్ రెపో రేటును దానికంటే 1 శాతం తక్కువ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి