RBI: బ్యాంక్ లోన్ ఎగ్గొడితే ఇక దబిడి దిబిడే.. ఆర్బీఐ కఠిన రూల్స్ తెలిస్తే షాకే..

బ్యాంకులు రుణ వసూళ్లకు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇప్పటికే ముసాయిదాను సిద్దం చేయగా.. అభిప్రాయలను స్వీకరిస్తోంది. ఈ నెల చివరివరకు అభిప్రాయాలు తెలపాలని కోరింది. అనంతరం ఈ నిబంధనలపై నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

RBI: బ్యాంక్ లోన్ ఎగ్గొడితే ఇక దబిడి దిబిడే.. ఆర్బీఐ కఠిన రూల్స్ తెలిస్తే షాకే..
Loan

Updated on: May 06, 2026 | 1:59 PM

మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారా..? అయితే మీరు తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంకులు లేదా ఎన్‌ఎఫ్‌బీసీ సంస్ధలు జప్తు చేయవచ్చు. ఈ మేరకు బ్యాంకులకు అధికారాలు ఇస్తూ త్వరలో ఆర్బీఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే కొత్త ముసాయిదాను సిద్దం చేయగా.. దీనిపై మే 26వ తేదీలోగా అభిప్రాయాలు తెలపాలని కోరింది. అభిప్రాయాలను పరిశీలించాక ఆర్బీఐ కొత్త నిబంధనలపై అధికారిక ప్రకటన చేయనుంది. రుణ వసూళ్లకు సంబంధించి ఎలాంటి బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలకు కొత్త రూల్స్ ప్రవేశపెట్టనుంది. మొండి బకాయిలను వసూలు చేసేందుకు బ్యాంకులకు ఇవి ఉపయోగపడనున్నాయి. అసలు ఈ కొత్త నిబంధనల్లో ఏం ఉన్నాయో ఒకసారి చూద్దాం.

స్వాధీనం చేసుకోవచ్చు

రుణం చెల్లించకపోతే బ్యాంకులు లేదా ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థలు భూమి లేదా ఇళ్లు వంటి తాకట్టు పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. అయితే వీటిని శాశ్వతంగా బ్యాంకులు ఉంచుకోలేవు. ఏడేళ్లలోపు వీటిని విక్రయించాల్సి ఉంటుంది. రుణం మొండి బకాయిగా మారినప్పుడు వసూలు చేసే వ్యూహంలో భాగంగా కస్టమర్ తాకట్టు పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. అలాగే వాటిని విక్రయించవచ్చు. విక్రయించడం వచ్చిన సొమ్ముతో బ్యాంకులు రుణం ఇచ్చిన సొమ్ములో ఎక్కువ మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే రుణం వసూలు చేయడంలో ఈ ప్రక్రియను వాడుకోవచ్చు. అయితే రుణం తీసుకున్న వ్యక్తికి లేదా వారితో సంబంధం ఉన్నవారికి విక్రయించడానికి వీల్లేదని నిబంధనల్లో పొందుపర్చింది. సకాంలో అమ్మకం జరిగేలా చూసేందుకు ఆస్తులను గరిష్టంగా ఏడేళ్ల పాటు అట్టిపెట్టుకోవచ్చని కొత్త రూల్స్‌లో స్పష్టం చేసింది.

బ్యాంకులకు ప్రయోజనం

నిర్దిష్ట ఆర్థికేతర ఆస్తుల(SNFA)ను సకాలంలో విక్రయించం ద్వారా సంస్థల తమ డబ్బులో ఎక్కువ మొత్తాన్ని తిరిగి తెచ్చుకోవచ్చని ఆర్బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది. లోన్ తీసుకున్న వ్యక్తి నుంచి రుణాన్ని రాబట్టుకునేందుకు స్వాధీనం చేసుకునే స్థిరాస్తినే SNFA అని పిలుస్తారు. ఇందులో బ్యాంకింగ్ యేతర ఆస్తులను కూడా చేర్చారు. రుణగ్రహీత మొత్తం లేదా కొంత బకాయి వసూలు చేయడానికి ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. అభిప్రాయ సేకరణ అనంతరం ఆర్బీఐ ఈ కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టనుంది. ఇదే జరిగితే రుణం వసూలు చేసేందుకు బ్యాంకులకు సౌలభ్యం కలగనుంది. వేగంగా కస్టమర్ నుంచి రుణం వసూలు చేయడంలో ఇది ఉపయోపగపడుతుంది. బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనలు కొద్దిగా అడ్డంకిగా మారాయి. దీంతో ఆర్బీఐ ఈ కొత్త నిబంధనలను రూపొంచింది.

Follow Us