
Debit and Credit Card Auto-Pay: మనదేశంలో కొత్త ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో డెబిట్, క్రెడిట్ కార్ట్ ఆటోమేటిక్ చెల్లింపులపై ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొస్తామని ప్రకటించింది. అయితే తాజాగా రికరింగ్ పేమెంట్స్ పై కస్టమర్స్ కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఊరట నిచ్చింది. కొత్తనిబంధనల అమలును 2021 సెప్టెంబర్ 30 వరకూ వాయిదా వేసింది. ఈ మేరకు బుధవారం ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆటోమేటిక్ చెల్లింపులకు అదనపు ధ్రువీకరణకు వెసులుబాటు కలిగినట్లు అయ్యింది.
రీఛార్జులు, ఓటీటీ, డీటీహెచ్, యుటిలిటీ బిల్లు సహా పలు సేవలకు సంబంధించి ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులకు వినియోగదారుల నుంచి అదనపు ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేస్తూ ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాలు జారీ చేసిన విషయం కస్టమర్లు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా జరిపే రికరింగ్ పేమెంట్లకు సంబంధించిన రెండంచెల అథంటికేషన్ రూల్స్‌ను పాటించాలని తెలిపింది.
కొత్త రూల్స్ ప్రకారం.. బ్యాంకులు, క్రెడిట్ కార్డు సర్వీస్ ప్రొవైడర్లు కస్టమర్లకు ఐదు రోజులు ముందుగానే డబ్బులు కట్ అవుతాయనే మెసేజ్‌ను పంపాలి. దీనికి కస్టమర్ నుంచి ఓకే అనే సమధానం రావాలి. అప్పుడు ఆటో డెబిట్ సదుపాయం పని చేస్తుంది. ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి
కొత్త నిబంధనల ప్రకారం రికరింగ్ ఆటోమేటిక్ చెల్లింపుల మొత్తం రూ. 5000 దాటితే.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్ గేట్‌వేల చెల్లింపుదారులకు ఓటీపీ పంపి వారి ఆమోదం తీసుకున్నాకే లావాదేవీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ చెల్లింపులను అనుమతించరు. అంతకుముందు రూ. 2000 మించి చేసే అన్ని లావాదేవీలకు దీన్ని పరిమితం చేయాలని ఆర్‌బీఐ భావించింది. అయితే ఈ పరిమితిని పెంచాలని విజ్ఞప్తులు రావడంతో రూ. 5000 మించిన చెల్లింపులకు ఏఎఫ్‌ఏ తప్పనిసరి చేసింది.
అయితే అయితే బ్యాంకులు, ఇతర వెండర్లు ఆర్‌బీఐ రూల్స్‌ను అమలు చేసే స్థితిలో లేమని.. కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌బీఐ సెప్టెంబరు 30 వరకు కొత్త రూల్స్ అమలుకు గడువు పొడిగించింది. అప్పటివరకు డెబిట్, క్రెడిట్ కార్డు ఆటోమేటిక్ చెల్లింపులు యథావిధిగా కొనసాగనున్నాయి.
April Fools’ Day 2021: సరదాగా జరుపుకునే ఏప్రిల్ పూల్స్ డే .. ఎప్పుడు.. ఎక్కడ ఎలా మొదలైందో తెలుసా..?