RBI New Rules: మీరు మొబైల్‌తో చెల్లింపులు చేస్తున్నారా? ఆర్బీఐ కొత్త నిబంధనలు!

చెల్లింపు వ్యవస్థను క్రమబద్ధీకరించే లక్ష్యంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మంగళవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అనుమానాస్పద లావాదేవీ కార్యకలాపాలను గుర్తించి అప్రమత్తం చేసేందుకు నాన్-బ్యాంకు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు రియల్ టైమ్ ఫ్రాడ్ మానిటరింగ్ చర్యలు చేపట్టాల్సి..

RBI New Rules: మీరు మొబైల్‌తో చెల్లింపులు చేస్తున్నారా? ఆర్బీఐ కొత్త నిబంధనలు!
Rbi

Updated on: Jul 31, 2024 | 3:24 PM

చెల్లింపు వ్యవస్థను క్రమబద్ధీకరించే లక్ష్యంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మంగళవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అనుమానాస్పద లావాదేవీ కార్యకలాపాలను గుర్తించి అప్రమత్తం చేసేందుకు నాన్-బ్యాంకు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు రియల్ టైమ్ ఫ్రాడ్ మానిటరింగ్ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. డిజిటల్ చెల్లింపు భద్రతా నియంత్రణలపై జారీ చేయబడిన ప్రాథమిక మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది.

పేమెంట్ల కోసం ఉపయోగించే మొబైల్ అప్లికేషన్స్‌కు డివైస్ బైండింగ్ లేదా ఫింగర్ ప్రింటింగ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్‌ను తప్పనిసిరి చేసింది రిజర్వ్‌ బ్యాంకు. సైబర్ రెసిలియెన్స్ అండ్ డిజిటల్ పేమెంట్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఫర్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు సంబంధించి కొత్తగా తీసుకువచ్చిన మాస్టర్ సర్క్యూలర్‌లో ఈ ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ. అయితే పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు తప్పకుండా ఏడాదిలో 365 రోజుల పాటు రోజంతా సమస్యలు పరిష్కారం కోసం ఒక సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అన్‌అథరైజ్డ్ లేదంటే మోసపూరిత ట్రాన్సాక్షన్లు జరిగితే వెంటనే స్పందించేలా ఈ వ్యవస్థ ఉండాలి.

ఇది కూడా చదవండి: Gas Cylinder: గ్యాస్ సిలిండర్ గురించి ముఖ్యమైన ప్రకటన.. తప్పక తెలుసుకోండి!

కస్టమర్లు ఫిర్యాదు చేసిన వెంటనే సమస్య పరిష్కారం మొదలు అవ్వాలని ఆర్‌బీఐ పేర్కొంటోంది. అంటే పేమెంట్ సిస్టమ్ ఆపరేట్లు.. లా ఎన్‌ఫోర్ట్స్‌మెంట్ ఏజెన్సీలకు ఈ ఫిర్యాదులను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ సిస్టమ్‌ వల్ల మోసపూరితమైన లావాదేవీలు జరపడానికి వీలుండని విధంగా ఉంటుంది. వెనువెంటనే స్పందించడం వల్ల మోసాలను అరికట్టవచ్చని ఆర్బీఐ చెబుతోంది. కాగా మరో వైపు ఆర్‌బీఐ మూడు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు ఝలక్‌ ఇచ్చింది. వీసా వరల్డ్ వైడ్, ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్, మణప్పురం ఫైనాన్స్ కంపెనీలకు షాకిచ్చింది. నిబంధనల ఉల్లంఘించినందుకు జరిమానా విధించింది.

వీసా వరల్డ్‌వైడ్‌కు రూ. 2.4 కోట్లు జరిమానా

ఇదిలా ఉండగా, వీసా వరల్డ్‌వైడ్‌కు రూ.2.4 కోట్లు జరిమానా విధించింది. అన్ఆథరైజ్డ్ అథంటికేషన్ సొల్యూషన్ అమలు చేయడం వల్ల ఈ కంపెనీకి జరిమానా పడింది. ఇక ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్, మణప్పురం ఫైనాన్స్‌కు కేవైసీ నిబంధన అతిక్రమణ వల్ల జరిమానా పడింది.

ఇది కూడా చదవండి: HDFC: మీకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు ఉందా? ఇక బాదుడే.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి