RBI: మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!

RBI: మొత్తం మీద మార్కెట్‌లో మిగిలి ఉన్న కొద్దిపాటి 2 వేల రూపాయల నోట్లను పూర్తిగా రికవరీ చేయడానికి ఆర్‌బిఐ ఈ చర్యలు తీసుకుంది. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రజలు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తమ నోట్లను..

RBI: మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!
RBI Notes

Updated on: Jul 11, 2026 | 7:54 AM

RBI: మే 19, 2023న చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియను ఆర్‌బిఐ ప్రారంభించింది. ఆ సమయంలో మార్కెట్లో సుమారు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, మొత్తం నోట్లలో 98.47 శాతం ఇప్పటికే విజయవంతంగా ఆర్‌బిఐకి తిరిగి వచ్చాయి. ప్రస్తుతం ప్రజల వద్ద మార్కెట్లో కేవలం రూ.5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆర్‌బిఐ తెలిపింది.

మార్పిడి చేసుకోవడానికి 2 ప్రధాన మార్గాలు: సాధారణ బ్యాంకు శాఖలలో వీటిని మార్చుకోవడానికి గడువు అక్టోబర్ 7, 2023 వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ గడువు ముగిసినందున ప్రజలు తమ నోట్లను ఈ కింది రెండు పద్ధతుల ద్వారా మార్చుకోవచ్చు.

ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాలు: ప్రజలు నోట్లను మార్చుకోవడానికి లేదా వాటిని తమ బ్యాంకు ఖాతాలలో జమ చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బిఐ 19 ప్రాంతీయ కార్యాలయాలను నేరుగా సందర్శించవచ్చు. ఈ కార్యాలయాలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలలో అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది 2 రూపాయల నోట్లను చెల్లుబాటు చేసుకోలేమని, అవి ఉంటే వృథా అని భావిస్తున్నారు. కానీ నోట్లను మార్చుకునే వెసులుబాటు ఇంకా ఉంది.

ఇవి కూడా చదవండి

పోస్టు ఆఫీసు ద్వారా: ఆర్‌బిఐ కార్యాలయాలకు నేరుగా వెళ్లలేని వారు, దేశంలోని ఏ పోస్టు ఆఫీసు నుండైనా తమ రూ.2,000 నోట్లను పోస్టు ద్వారా ఆర్‌బిఐ కార్యాలయానికి సురక్షితంగా పంపవచ్చు. నోట్లు ఆర్‌బిఐకి చేరిన వెంటనే ఆ మొత్తం నేరుగా కస్టమర్ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.

మొత్తం మీద మార్కెట్‌లో మిగిలి ఉన్న కొద్దిపాటి నోట్లను పూర్తిగా రికవరీ చేయడానికి ఆర్‌బిఐ ఈ చర్యలు తీసుకుంది. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రజలు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తమ నోట్లను మార్చుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: Aadhaar Card: ఆధార్‌ కార్డులో కొత్త అప్‌డేట్‌.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం..!

ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. తులం ధర ఎంత ఉందో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us