
UPI in Cash Deposit Machines: యూపీఐ ద్వారా కొన్ని ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకునే అవకాశం లభించింది. అదేవిధంగా, యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ కూడా అందుబాటులో ఉంది. ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశం తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ సౌకర్యాన్ని ప్రకటించారు. మీరు క్యాష్ డిపాజిట్ మెషీన్స్ (CDM) వద్ద ఏటీఎం కార్డ్‌ని ఉపయోగించి మీ ఖాతాలో నగదు జమ చేయవచ్చు. ఇప్పుడు దీనికి అదనంగా యూపీఐ ద్వారా ఈ మెషీన్లలోకి లాగిన్ చేయడం ద్వారా నగదు డిపాజిట్లు చేయవచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం లేదా మార్గదర్శకాలను ఆర్‌బీఐ త్వరలో వెల్లడిస్తుంది.
సీడీఎం వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆర్బీఐ ఈ చర్యను అమలు చేసే అవకాశం ఉంది. మీరు బ్యాంకు కార్యాలయాలలో నగదు డిపాజిట్ యంత్రాలను చూడవచ్చు. కొన్ని నిర్దిష్ట ఏటీఎం కేంద్రాలలో సీడీఎంలు కూడా ఉన్నాయి. ఈ సీడీఎం ద్వారా బ్యాంకుల్లో క్యూలలో నిలబడి నగదు డిపాజిట్లు చేసే సమయంలో సమయం వృథా కాకుండా నివారించవచ్చు. బ్యాంకు ఆఫీసు తలుపులు మూసి ఉన్నా ఈ సీడీఎంలు తెరిచే ఉంటాయి. దీంతో వినియోగదారులకు మేలు జరుగుతుంది.
ఆర్బీఐ ద్వారా ఇతర పథకాల ప్రకటన: అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (IFSC)లో సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి ఒక పథకం ప్రారంభిస్తోంది.
రిటైల్ డైరెక్ట్ స్కీమ్: మొబైల్ యాప్ రిటైల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి 2020లో రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ప్రారంభించింది. దీనికి అధికారిక పోర్టల్ ఉంది. ఆర్బీఐ మొబైల్ యాప్ కూడా విడుదల చేసింది.
థర్డ్ పార్టీ యాప్ ద్వారా పీపీఐ నుండి యూపీఐ చెల్లింపు: Paytm, PhonePe మొదలైన ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల (PPIలు) ద్వారా యూపీఐ చెల్లింపులు చేయడానికి, ఆ పీపీఐలల ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించాలి. ఇప్పుడు దీని కోసం థర్డ్ పార్టీ యూపీఐ యాప్‌లను వినియోగించుకునేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి