Ratan Tata Funeral: ‘భారత్‌ కోహినూర్ ఇకలేరు.. ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు’: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే

|

Oct 10, 2024 | 8:33 AM

ప్రముఖ పారిశ్రామిక వేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా 86 యేళ్ల వయసులో బుధవారం కన్నుమూశారు. రతన్ టాటా చాలా కాలంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఐసీయూలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస..

Ratan Tata Funeral: భారత్‌ కోహినూర్ ఇకలేరు.. ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే
Ratan Tata
Follow us on

ముంబై, అక్టోబర్ 10: ప్రముఖ పారిశ్రామిక వేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా 86 యేళ్ల వయసులో బుధవారం కన్నుమూశారు. రతన్ టాటా చాలా కాలంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఐసీయూలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీతోసహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు జరుపుతామని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు. భారత్‌ కోహినూర్ ఇక లేదని సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. ‘మా నుండి విడిపోయారు. రతన్ టాటా జీ ఇక మన మధ్య లేరు. ఇది యావత్ దేశానికి విషాదకరమైన సంఘటన. ఆయన దేశానికి చేసిన సేవ చిరస్మరణీయం అన్నారు. ఆయన భౌతికకాయాన్ని దక్షిణ ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సిపిఎ)లో గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు నివాళులర్పించేందుకు ఉంచుతామని ఆయన బంధువులు తెలిపారు.

మహారాష్ట్ర రాష్ట్రంలో ఈ రోజును సంతాప దినంగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. మహారాష్ట్రలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ త్రివర్ణ పతాకాన్ని గురువారం అర్ధ మాస్ట్‌లో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజున రాష్ట్రంలో ఎలాంటి వినోద కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో గురువారం ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. మహారాష్ట్ర సీఎంతో పాటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ఆ రాష్ట్రంలో గురువారాన్ని సంతాప దినంగా ప్రకటించారు. జార్ఖండ్ వంటి వెనుకబడిన రాష్ట్రానికి ప్రపంచ గుర్తింపును అందించిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రతన్ టాటా మృతికి రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు సంతాపం ప్రకటిస్తున్నట్లు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

ఇవి కూడా చదవండి

ఏక్‌నాథ్ షిండే కూడా సోషల్‌ మీడియాలో రతన్ టాటా మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. ‘దేశం విలువైన రత్నాన్ని కోల్పోయింది. రతన్‌జీ టాటా నైతికత, వ్యవస్థాపకత ఏకైక, ఆదర్శ సంగమం. దాదాపు 150 సంవత్సరాల పాటు విశిష్టత, సమగ్రతతో కూడిన సంప్రదాయంతో టాటా గ్రూప్‌ను విజయవంతంగా నడిపించిన రతన్‌జీ టాటా ఒక సజీవ లెజెండ్. అతను ఎప్పటికప్పుడు ప్రదర్శించే నిర్ణయాత్మక సామర్థ్యం, మానసిక బలం టాటా గ్రూప్‌ను కొత్త పారిశ్రామిక శిఖరాలకు తీసుకెళ్లాయి. ఆయనకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.